Wednesday, January 22, 2025

మెగా ఫ్యాన్స్ గుడ్ న్యూస్.. గేమ్‌ ఛేంజర్‌ అప్డేట్ వచ్చేసింది

- Advertisement -
- Advertisement -

గేమ్‌ ఛేంజర్‌ సినిమా నుంచి క్రేజీ అప్డేట్ వచ్చేసింది. మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్‌, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్‌ కాంబోలో గేమ్‌ ఛేంజర్‌ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రామ్ చరణ్ కు సంబంధించిన షూట్ కూడా కంప్లీట్ అయ్యింది. దాదాపు 90 శాతం ఈ మూవీ షూటింగ్ కూడా పూర్తైంది. దీంతో ఈ చిత్రం నుంచి అప్డేట్స్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా మేకర్స్ అప్డేట్ ఇచ్చింది. బుధవారం ఈసినిమా డబ్బింగ్‌ పనులు ప్రారంభమయ్యాయిన తెలిపుతూ ఫోటో షేర్ చేశారు.

కాగా ఈ సినిమా క్రిస్మస్‌ కానుకగా విడుదల చేయనున్నట్లు నిర్మాత దిల్ రాజ్ ప్రకటించిన సంగతి తెలిసందే. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఎస్‌జే సూర్య, నవీన్ చంద్ర, శ్రీకాంత్, సముద్రఖని, జయరామ్, సునీల్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ‘గేమ్ ఛేంజర్’ను గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News