Thursday, January 23, 2025

చరణ్ బర్త్‌డేకి ‘గేమ్ చేంజర్’

- Advertisement -
- Advertisement -

బ్లాక్‌బస్టర్ ‘ఆర్‌ఆర్‌ఆర్’ తర్వాత మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ పొలిటికల్ డ్రామాకి సంబంధించిన అప్‌డేట్‌ల కోసం రామ్‌చరణ్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం నిర్మాత దిల్ రాజు… చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 27న గేమ్ ఛేంజర్ సినిమాను విడుదల చేసే అవకాశం ఉందని తెలిసింది. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన రానుందట.

కాగా కియారా అద్వానీ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తుండగా, అంజలి, శ్రీకాంత్, ఎస్‌జె సూర్య, నవీన్ చంద్ర వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ తన కెరీర్ లోనే బెస్ట్ లుక్‌లో కనిపించబోతున్నాడు. ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలోని నాటు నాటు… పాటకి ఆస్కార్ వచ్చిన తర్వాత, రామ్ చరణ్ తేజ్ ఇమేజ్ గ్లోబల్ రేంజ్ కి వెళ్ళింది. అందుకే శంకర్ కూడా చరణ్ సినిమాని ఆ రేంజ్‌లోనే ప్లాన్ చేశాడు. మొత్తానికి భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బరువైన ఎమోషన్స్ తో పాటు గ్రాండ్ విజువల్స్ కూడా ఉండబోతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News