- Advertisement -
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్ బ్యానర్‌లపై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో కియారా అద్వాని హీరోయిన్‌గా నటిస్తున్నారు. క్రిస్మస్ సందర్భంగా ఈ భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రాన్ని వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ చేస్తున్నారు. అయితే బుధవారం కియారా అద్వానీ పుట్టినరోజు సందర్భంగా గేమ్ ఛేంజర్ నుంచి ఆమె లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. చూపు తిప్పుకోవటం కష్టం అనేంతంగా కియారా గ్లామర్ లుక్ అభిమానులు, సినీ ప్రేక్షకులను కట్టి పడేస్తోంది. ఇటీవల గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన పాత్రకు సంబంధించిన చిత్రీకరణను పూర్తి చేసేశారు. డైరెక్టర్ శంకర్ మిగిలిన చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు.
- Advertisement -