Saturday, January 4, 2025

‘గేమ్ చేంజర్’ సెన్సార్ పూర్తి

- Advertisement -
- Advertisement -

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. ఈ చిత్రంలో కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమాను అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్లపై దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ మూవీ జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటివరకు రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ కూడా ఈ సినిమాపై అంచనాలను పెంచేస్తోంది.

ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ పనులు కూడా ముగిసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసినట్లు సినీ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా నిడివి 2 గంటల 45 నిమిషాలుగా ఉన్నట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ రెండు వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలో ఎస్.జె.సూర్య, శ్రీకాంత్, అంజలి తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఐదు పాటలు బిగ్ స్క్రీన్ మీద దేనికదే అన్నట్టుగా ఉంటాయి. ఎస్‌జే సూర్య, రామ్ చరణ్ సీన్లతో థియేటర్లు దద్దరిల్లుతాయి. జనవరి 1న ట్రైలర్ రానుంది. పవన్ కళ్యాణ్ ఇచ్చే డేట్‌ను బట్టి జనవరి 4 లేదా 5వ తేదీలో ఏపీలో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News