Tuesday, January 7, 2025

‘గేమ్ చేంజర్’ అద్భుతంగా ఉండబోతోంది

- Advertisement -
- Advertisement -

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’ విడుదలకు సిద్దమైంది. ఈ సందర్బంగా ఈ సినిమాలో నటించిన ప్రముఖ నటుడు ఎస్ జే సూర్య మీడియాతో మాట్లాడుతూ.. ‘శంకర్‌తో పనిచేయాలని ప్రతీ ఒక్క ఆర్టిస్ట్‌కీ ఉంటుంది. ఆయన ప్రతీ ఒక్క కారెక్టర్‌ను నటించి చూపిస్తారు. ఆయన చెప్పింది చెప్పినట్టుగా చేస్తే స్క్రీన్ మీద మ్యాజిక్‌లా కనిపిస్తుంది. రామ్ చరణ్ అద్భుతమైన నటులు. ఆయన గ్లోబల్ స్టార్‌గా ఎదిగారు. ఈ చిత్రంలో ఆయన డిఫరెంట్ షేడ్స్‌లో కనిపిస్తారు. ఐఏఎస్ ఆఫీసర్‌గా ఎంతో హుందాగా కనిపిస్తారు.

అప్పన్న పాత్ర అయితే లైఫ్ టైం గుర్తుండిపోయేలా ఉంటుంది. ఆ అప్పన్న పాత్రలో రామ్ చరణ్ అద్భుతంగా నటించారు. ఓ నిజాయితీగా ఐఏఎస్ ఆఫీసర్‌కి, అవినీత పరుడైన రాజకీయ నాయకుడికి మధ్య జరిగే వార్‌ను గేమ్ చేంజర్‌లో చూపిస్తారు. ఈ రెండు పాత్రల మధ్య సీన్లను ఎలా చిత్రీకరించారు.. ఎంత బాగా కథనాన్ని శంకర్ గారు రాశారు అన్నది మీరు థియేటర్లోనే చూడాల్సింది. ఈ చిత్రం అద్భుతంగా ఉండబోతోంది. అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉంటాయి. అందరినీ అలరించేలా ఈ మూవీ ఉంటుంది. నాకు శంకర్ అద్భుతమైన పాత్రను ఇచ్చారు. ఈ కారెక్టర్‌ను నేను చాలా ఎంజాయ్ చేశాను. అందుకే తెలుగు, తమిళం, హిందీ ఇలా అన్ని భాషల్లో డబ్బింగ్ చెప్పాను.

రామ్ చరణ్ సీన్లు, నా సీన్లు అద్భుతంగా వచ్చాయి. మా ఇద్దరి మధ్య ఉండే సీన్లు ఆడియెన్స్‌కు మంచి కిక్ ఇస్తాయి. దిల్ రాజు నిజంగా ఆల్ రౌండర్. కేవలం డబ్బులు పెట్టి సినిమాలు తీసే వాళ్లని నిర్మాత అని చెప్పలేం. దిల్ రాజు సెట్‌కు వస్తారు. అన్ని క్రాఫ్ట్‌లను పరిశీలిస్తారు. సెట్స్ మీదే సమస్యల్ని వెంటనే పరిష్కరిస్తారు. ఆయనకు కథల మీద మంచి పట్టుంది. ఏదైనా సరే ముక్కుసూటిగా మాట్లాడతారు. అందుకే దిల్ రాజు గారు ఆల్ రౌండర్ అన్నాను. ఆయన ఈ సినిమాకు చాలా ఖర్చు పెట్టారు. ఒక్క జరగండి పాటకే కొన్ని కోట్లు పెట్టారు. ఆ సాంగ్ ఎలా ఉండబోతోందో థియేటర్లో మీకే తెలుస్తుంది‘అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News