- Advertisement -
అమరావతి: గేమ్ ఛేంజర్ ఈవెంట్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజమండ్రిలో జరిగింది. మృతులకు నిర్మాత దిల్ రాజు రూ.5 లక్షలు సాయం ప్రకటించారు. రంగంపేట మండలం ఎడిబి రోడ్డులో కార్గిల్ ఫ్యాక్టరీ సమీపంలో బైక్ ను వ్యాన్ ఢీకొట్టడంతో ఇద్దరు చనిపోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు కాకినాడకు చెందిన మణికంఠ (23), చరణ్(25) అనే యువకులుగా గుర్తించారు. ఈ విషయం తెలిసిన వెంటనే వాళ్ల కుటుంబ సభ్యులకు నిర్మాత దిల్ రాజు రూ.5 లక్షలు సాయం ప్రకటించారు.
- Advertisement -