- Advertisement -
హైదరాబాద్: హీరో రాంచరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమా టీం తమను మోసం చేసిందని పోలీస్ స్టేషన్ లో ఆర్టిస్టుల ఫిర్యాదు చేశారు. గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ కోసం గుంటూరు, విజయవాడ నుండి హైదరాబాద్ కి 350 మంది వెళ్లామని, కో డైరెక్టర్ స్వర్గం శివ తమకు రూ.1200 ఇస్తానని ఒప్పుకొని డబ్బులు ఇవ్వలేదని ఆరోపణలు చేశారు. గుంటూరు పోలీస్ స్టేషన్ సదరు ఆర్టిస్ట్ తరుణ్ ఫిర్యాదు చేశారు. గేమ్ ఛేంజర్ సినీ నిర్మాత దిల్ రాజు తమకు న్యాయం చేయాలని, మోసం చేసిన స్వర్గం శివపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
- Advertisement -