గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్, దర్శకుడు శంకర్ ఇద్దరి కెరీర్‌లో 15వ సినిమాగా చేస్తున్న లేటెస్ట్ చిత్రం గేమ్ ఛేంజర్. భారీ అంచనాల నడుమ 2025లో విడుదలవుతున్న పాన్ ఇండియా మూవీ ఇది. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సంక్రాంతి సందర్భంగా జనవరి 10న విడుదలవుతుంది. ఇక సినిమా రిలీజ్‌కి సరిగ్గా నెల మాత్రమే ఉన్నప్పటికీ ట్రైలర్‌పై ఇంకా ఎలాంటి అప్డేట్ ని మేకర్స్ అందించలేదు.
అయితే ఈ సినిమా ట్రైలర్‌ని ఈ నెలాఖరున రిలీజ్ చేయనున్నారని తెలిసింది. మాములుగా ఇతర బిగ్ స్టార్స్ సినిమాల ట్రైలర్స్ ఒక నెల ముందే లేదా 15 రోజుల ముందే విడుదల చేసేస్తున్నారు. మళ్ళీ సినిమా రిలీజ్ ముందు రెండో ట్రైలర్ కూడా విడుదల చేస్తున్నారు. ఇక మన దేశంలో మాత్రమే కాకుండా యూఎస్‌లో ఉన్న ప్రవాస తెలుగు ప్రజలు సహా నార్త్ ఆడియెన్స్ కూడా గేమ్ ఛేంజర్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే యూఎస్‌లో గేమ్ ఛేంజర్ బుకింగ్స్‌పై ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ వచ్చేసింది.
అక్కడ ఈ చిత్రాన్ని శ్లోక ఎంటర్‌టైన్‌మెంట్స్ వారు భారీ లెవెల్లో రిలీజ్ చేస్తున్నారు. అక్కడ ఈ చిత్రం డిసెంబర్ 14 నుంచి బుకింగ్స్ ఓపెన్ చేసుకోబోతుందట. ఇక ఈ సినిమా నుంచి విడుదలైన ‘నానా హైరానా’ పాటకు అద్భుతమైన స్పందన వచ్చింది. అయితే ఈ పాటను న్యూజిలాండ్‌లో 6 రోజుల పాటు చిత్రీకరించారు. దాదాపు 10 కోట్ల బడ్జెట్‌తో ఈ పాటను తెరకెక్కించారని తెలిసింది. తమన్ సంగీతాన్ని అందించిన ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించారు. ఇక యూఎస్‌లో ఈనెల 21న గేమ్‌ఛేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను భారీగా నిర్వహించబోతున్నారు.