గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో తెరెక్కిన చిత్రం ‘గేమ్ చేంజర్’. ఈ సినిమాను అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్లపై దిల్ రాజు, శిరీష్ లు భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఇందులో కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటించారు. ఇప్పటికే విడుదల చేసిన టీజర్, సాంగ్స్ కు మంచి రెస్పెన్స్ వచ్చింది. ఈ మూవీ విడుదల దగ్గర పడుతుండటంతో మేకర్స్ క్రేజీ అప్డేట్ వదిలారు. ఈ మూవీ ట్రైలర్ ను రేపు సాయంత్రం 5.04గంటలకు విడుదల చేయనున్నారు.
ఈ విషయాన్ని తెలియజేస్తూ యూనిట్ పోస్టర్ రిలీజ్ చేశారు.ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ పనులు కూడా ముగిసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసినట్లు సినీ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా నిడివి 2 గంటల 45 నిమిషాలుగా ఉన్నట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా, తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ మూవీ జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది.
#GameChangerTrailer from 2.1.2025!#GameChangerOnJanuary10🚁
Global Star @AlwaysRamCharan pic.twitter.com/fQLIvS9UHs
— Vamsi Kaka (@vamsikaka) January 1, 2025