Wednesday, January 22, 2025

‘గేమ్ ఆన్’ సినిమా షురూ

- Advertisement -
- Advertisement -


లూజర్‌గా ఉన్న ఒక యువకుడు విన్నర్ ఎలా అయ్యాడు? అనే కథాంశంతో ఊహించని అంశాలతో, ట్విస్ట్‌లతో… సైకాలజికల్, రొమాంటిక్, యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న చిత్రం ‘గేమ్ ఆన్’. రవి కస్తూరి సమర్పణలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర క్రియేషన్స్, గోల్డెన్ వింగ్ ప్రొడక్షన్స్, పమిడి క్రియేషన్స్ పతాకంపై గీతానంద్, నేహా సోలంకి జంటగా దయానంద్ దర్శకత్వంలో కుమార్ బాబు, రవి కస్తూరి, పమిడి రవితేజలు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రమిది. ఈ చిత్రం ప్రారంభోత్సవ పూజా కార్యక్రమాలు ఫిల్మ్ నగర్‌లోని దైవ సన్నిధానంలో సినీ ప్రముఖుల మధ్య అంగరంగ వైభవంగా జరిగాయి. పూజా కార్యక్రమాల అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన దర్శకుడు ప్రవీణ్ సత్తారు హీరో గీతానంద్,నేహా సోలంకిలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టారు.

పారిశ్రామిక వేత్త పమిడి రమేష్ కెమెరా స్విచ్చాన్ చేశారు. అనంతరం ఏర్పాటుచేసిన పాత్రికేయులు సమావేశంలో చిత్ర దర్శకుడు దయానంద్ మాట్లాడుతూ “రొమాన్స్, యాక్షన్, థ్రిల్లర్, ఎమోషన్స్ ఇందులో ఉంటాయి. యూత్ నుండి పెద్ద వాళ్లు వరకు అందరికీ నచ్చేటట్లు ఈ సినిమా ఉంటుంది”అని అన్నారు. చిత్ర నిర్మాత జి.కుమార్ బాబు మాట్లాడుతూ “ఈ చిత్రంలో యూత్‌ను ఆకట్టుకునే అంశాలు చాలా వున్నాయి. ఈ స్క్రిప్ట్ కోసం దర్శకుడు చాలా కష్టపడ్డాడు. ఔట్‌ఫుట్ కూడా బాగా వచ్చింది”అని తెలిపారు. ఈ సమావేశంలో నిర్మాత పమిడి రమేష్, హీరో గీతానంద్, హీరోయిన్లు నేహా సోలంకి, వసంతి, కిరీటి పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News