Wednesday, January 22, 2025

గేమ్ ఆన్ రివ్యూ.. ప్రేక్షకులకు డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్

- Advertisement -
- Advertisement -

దయానంద్ దర్శకత్వంలో గీతానంద్, నేహా సోలంకి జంట‌గా న‌టించిన చిత్రం గేమ్ ఆన్. ఈ చిత్రాన్ని క‌స్తూరి క్రియేష‌న్స్ అండ్ గోల్డెన్ వింగ్ ప్రొడ‌క్షన్స్‌ బ్యాన‌ర్స్‌పై ర‌వి క‌స్తూరి నిర్మించారు. గేమ్ ఆన్ సినిమాలో సీనియర్ నటులు శుభలేఖ సుధాకర్, మధుబాల, ఆదిత్య మీనన్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఫిబ్రవ‌రి 2 తేదీన ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూ చూద్దాం…

నటీనటులు : 
గీతానంద్‌, నేహా సోలంకి, ఆదిత్య మీన‌న్, మ‌ధుబాల‌, శుభ‌లేఖ‌ సుధాక‌ర్‌, ఆదిత్య మీనన్, వాసంతి, కిరిటీ తదితరులు.

టెక్నీషియన్స్ :
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ : అర‌వింద్ విశ్వనాథ‌న్‌ ;
ఎడిటర్ : వంశీ అట్లూరి ;
సంగీతం : అభిషేక్ ఏ.ఆర్, నవాబ్ గ్యాంగ్, అశ్విన్, అరుణ్ ;
ఆర్ట్ డైరెక్టర్: విఠ‌ల్‌ ;
స్క్రిప్ట్ సూప‌ర్ వైజ‌ర్ : విజ‌య్ కుమార్ సి.హెచ్ ;
యాక్షన్ కొరియోగ్రఫీః రామ‌కృష్ణ
పి. ఆర్. ఓ. :  జీ కె మీడియా ;
నిర్మాత : రవి కస్తూరి ;
కథ–మాటలు–స్ర్కీన్‌ప్లే–- ద‌ర్శకత్వం :  దయానంద్.
విడుదల తేదీ ; 02–02–2024

కథ : లూజర్ గా ఉన్న వ్యక్తి విన్నర్ గా ఎలా మారాడనేది ఈ సినిమా మెయిన్ కాన్సెప్ట్. ఇందులోనే మదర్ సెంటిమెంట్ ఎమోషన్స్ కూడా చూపించారు. ప్రేమగా చూసుకునే తల్లి వేరే పెళ్లి చేసుకుని వెళ్లిపోవడంతో ఆ తల్లిపై ద్వేషం పెంచుకుంటాడు కొడుకు. ఆ కోపంతో సైకో గా మారి వాళ్ళ అమ్మ గురించి మాట్లాడిన ప్రతి ఒక్కరిని కొడుతూ ఉంటాడు. ఒకరిని క్రూరంగా చంపేస్తాడు. ఆ మర్డర్ ను తాత పై వేసుకుని మనవడిని తప్పిస్తాడు. తర్వాత ఆ హీరో ఎలా పెరిగాడు? ఎలా మారాడు? ఏం చేస్తాడు? ఏ విధంగా ప్రవర్తిస్తాడు అనేది కథ. ఇందులో భాగంగానే తను ఒక గేమ్ ట్రాప్ లో చిక్కుకుంటాడు. ఒకానొక సందర్భంలో చనిపోదాం అనుకునే హీరోను ఆ గేమ్ ఎలా మార్చింది.. తన తల్లిని ఏ విధంగా కలుసుకుంటాడు ఏం చేస్తాడు అనేది ఆసక్తికరంగా చూపించారు.

ఎవరు ఎలా చేశారంటే :
హీరో గీతానంద్ సెటిల్డ్ పర్ఫామెన్స్ తో అందరినీ ఆకట్టుకుంటాడు. యాక్షన్ తోపాటు ఎమోషన్ ను కూడా బాగా పండించాడు. తనదైన మేనరిజంతో ఇంప్రెస్ చేశాడు. హీరోయిన్ నేహా సోలంకి గ్లామర్ లుక్ తో యూత్ ను అట్రాక్ట్ చేసేలా కనిపించింది. సిగరెట్ మందు తాగుతూ మాసివ్ గానూ మెస్మరైజ్ చేసింది. చాలా రోజుల తర్వాత సీనియర్ నటులు శుభలేఖ సుధాకర్ కీలక పాత్ర పోషించారు. సినిమా ఓపెనింగే ఆయన క్యారెక్టర్ ని చూపిస్తూ ప్రారంభమవుతుంది. సీరియస్ ఇంటెన్స్ పాత్రను పోషించారాయన. హీరో తల్లి పాత్రలో మధుబాల ఇంపార్టెంట్ రోల్ చేశారు. డీసెంట్ పెర్ఫార్మెన్స్ తో ఆమె ఆకట్టుకున్నారు. ఆదిత్య మీనన్ సైకాలజిస్ట్ గా కనిపించారు. ఆయన క్యారెక్టర్ సినిమాకు కీలకం. ఆయన పోషించిన తీరు ఆయన హావభావాలు ఆయన లుక్ ప్రెజెన్స్ సూపర్బ్ గా ఉంటాయి. ఇక కిరీటి, వాసంతి తమ పరిధి మేర నటించారు.

సాంకేతిక వర్గం : టెక్నికల్ విషయానికొస్తే ఈ చిత్రాన్ని చాలా రిచ్ గా చిత్రీకరించారు. సినిమాటోగ్రాఫర్ అరవింద్ విశ్వనాథ్ అందించిన విజువల్స్ మెప్పిస్తాయి. సినిమా అంతా రేసీగా సాగేలా ఎడిటర్ వంశీ అట్లూరి ఎడిటింగ్ చేశారు. అభిషేక్ ఏ ఆర్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకు హైలెట్ గా నిలిచింది. రిచ్ రిచ్ సాంగు చాలా లావిష్ గా ఉంటుంది. నవాబ్ గ్యాంగ్ అశ్విని అరుణ్ అందించిన పాటలు సినిమాకు ప్లస్ అవుతాయి. డైరెక్టర్ దయానంద్ అన్ని విషయాల్లో కేర్ తీసుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. టైట్ స్క్రీన్ ప్లే తో ప్రేక్షకుడికి ఎక్కడా బోర్ కొట్టని విధంగా కథను రాశారు. యాక్షన్ సీక్వెన్స్ లు చాలా కొత్తగా ఉంటాయి. రామకృష్ణ చేసిన యాక్షన్ కొరియోగ్రఫీలో హీరోని డిఫరెంట్ గా ప్రజెంట్ చేశారు.

విశ్లేషణ : కొత్తవారితో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. రియల్ టైం సైకలాజికల్ థ్రిల్లర్ గా కొనసాగుతూ ఆడియోన్స్ లో క్యూరియాసిటీని పెంచాలా ఉంది. యాక్షన్, రొమాన్స్ తో పాటు సెంటిమెంట్ ను జోడించి ప్రోపర్ కమర్షియల్ చిత్రంగా రూపొందించారు. గీతానంద్, నేహా సోలంకి మధ్య కెమిస్ట్రీ అందర్నీ ఆకట్టుకుంటుంది. దర్శకుడిగా మొదటి సినిమా అయినా.. ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్ లా దయానంద్ ఈ చిత్రాన్ని రూపొందించాడు. నిర్మాత రవి కస్తూరి కి కూడా ఇది ఫస్ట్ ప్రాజెక్ట్ అయినా.. బడ్జెట్ పరంగా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. ఓవరాల్ గా.. ఈ సినిమా ప్రేక్షకులకు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది.

రేటింగ్ : 3.5

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News