Sunday, January 19, 2025

‘గామి’ చాలా అరుదైన చిత్రం : సందీప్‌రెడ్డి వంగా

- Advertisement -
- Advertisement -

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ’గామి’ షోరీల్ ట్రైలర్‌ను హైదరాబాద్‌లోని ప్రసాద్స్‌లోని పిసిఎక్స్ స్క్రీన్‌లోగ్రాండ్‌గా విడుదల చేశారు. పిసిఎక్స్ ఫార్మాట్‌లో తొలిసారిగా విడుదల చేసిన ఈ ట్రైలర్‌ను స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేశారు. ‘నేనెవరినో, అసలు ఎక్కడి నుంచి వచ్చానో, నాకీ సమస్య ఎప్పటినుంచి వుందో, ఎంత ప్రయత్నించినా గుర్తు రావడం లేదు’ అని విశ్వక్ సేన్ తనను తాను ప్రశ్నించుకునే సన్నివేశంతో ట్రైలర్ ప్రారంభమవుతుంది.

ట్రైలర్ ప్రధాన పాత్రల ప్రయాణాన్ని చూపిస్తుంది, ప్రతి కథ దాని అద్భుతంగా ఉంది. మానవ స్పర్శను అనుభవించలేని సమస్య ఉన్న విశ్వక్ సేన్ కథ, అతని జర్నీ అద్భుతంగా వుంది. హీరో తన పాత్రను అద్భుతంగా పోషించాడు. దర్శకుడు విద్యాధర్ ఒక విలక్షణమైన కాన్సెప్ట్‌ని రేసీ స్క్రీన్‌ప్లేతో అద్భుతంగా మలిచాడు. కార్తిక్ కల్ట్ క్రియేషన్స్‌పై కార్తీక్ శబరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి క్రౌడ్ ఫండ్ చేశారు. వి సెల్యులాయిడ్ సమర్పిస్తోంది. విద్యాధర్ కాగిత, ప్రత్యూష్ వత్యం స్క్రీన్ ప్లే రాశారు. మార్చి 8న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాపై షోరీల్ ట్రైలర్ చాలా ఆసక్తిని పెంచింది.

ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ “ట్రైలర్ చాలా బావుంది. చాలా అరుదైన సినిమా ఇది. ఆరేళ్ల పాటు ఒక సినిమాని అంకితభావంతో చేయడం మామూలు విషయం కాదు. యాక్టర్స్, డైరెక్టర్, నిర్మాతలకు చాలా పాషన్ ఉంటేనే ఇది సాధ్యమవుతుంది”అని అన్నారు. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మాట్లాడుతూ “దర్శకుడు విద్యాధర్ విజన్‌ని బలంగా నమ్మాము. అన్ని సినిమాలు వేరు ఈ సినిమా ఇచ్చిన కిక్ వేరు.

చిన్న టీంతో మొదలుపెట్టి ఈ రోజు ఇంత బిగ్ స్క్రీన్‌లో ట్రైలర్ చూడటం చాలా ఆనందంగా వుంది. ఇందులో మాస్ డైలాగులు, ఫైట్స్, ఐటమ్ సాంగ్స్ ఉండవు. కానీ ఇవన్నీ ఇచ్చే ఫీలింగ్ సెకండ్ హాఫ్ లో వుంటుంది. ప్రతి తెలుగు ఫిల్మ్ మేకర్ గర్వంగా చెప్పుకునే సినిమా ఇది”అని పేర్కొన్నారు. దర్శకుడు విద్యాధర్ కాగిత మాట్లాడుతూ “గామి సినిమా చూస్తున్నంత సేపు తర్వాత ఏం జరుగుతుందనే ఆసక్తి ఏర్పడుతుంది. దాని కోసమే ఇన్నేళ్ళు కష్టపడ్డాం. మార్చి 8న కొత్తరం తెలుగు సినిమాని చూస్తారు”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో చాందినీ చౌదరి, కార్తీక్ శబరీష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News