Sunday, November 17, 2024

టైగర్ ష్రాఫ్ హీరోగా గణపధ్ ట్రైలర్ విడుదల

- Advertisement -
- Advertisement -

టైగర్ ష్రాఫ్ వీరోచిత పోరాటాలతో, కృతి సనన్ డాషింగ్ ఫైట్స్ తో, అమితాబ్ అద్భుత స్క్రీన్ ప్రెజెన్స్ తో కొత్త లోకాన్ని పరిచయం చేసిన గణపధ్ ట్రైలర్. మెగా యాక్షన్ ట్రైలర్ తో కొత్త ప్రపంచాన్ని గణపధ్ ట్రైలర్ పరిచయం చేసింది.

పూజ ఎంటర్టైన్మెంట్ ఇప్పటికే దూసుకుపోతున్న భారతీయ చిత్ర పరిశ్రమ లో మరో సంచలనానికి నాంది పలికింది. కొత్త తరహా ప్రపంచంలో వినూత్నమైన యాక్షన్ ను పరిచయం చేస్తూ విడుదల చేసిన గణపధ్ ట్రైలర్ ప్రేక్షకులను మెస్మెరైజ్ చేస్తోంది.

అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న గణపధ్ ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు. వినూత్నమైన యాక్షన్ తో కూడిన ఈ ట్రైలర్ చిత్ర వర్గాల తో పాటు, ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసి, అక్టోబర్ 20న చిత్రం విడుదల కోసం ఎంతగానో ఎదురు చూసేలా చేసింది. టైగర్ ష్రాఫ్ తో పాటూ కృతి సనన్, అమితాబ్ బచ్చన్ ల కలయిక లో వచ్చిన ఈ చిత్రం పట్ల ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఈ ఆసక్తిని మరింత పెంచేందుకు చిత్ర బృందం ట్రైలర్ ను విడుదల చేసింది.

గణపధ్ ట్రైలర్ ప్రేక్షకులకు ఒక యాక్షన్ విందు ను అందివ్వనుంది. స్టన్నింగ్ విజువల్స్, ఉత్కంఠ రేపే పోరాట సన్నివేశాల తో పాటు, భారీ కాస్టింగ్ ఉండటం తో సినిమా పైన అంచనాలు పెరిగిపోయాయి. ఈ ట్రైలర్ ప్రేక్షకుల్ని ఒక పెయింటింగ్ లాంటి నూతన ప్రపంచం లోకి తీసుకెళ్లింది. భవిష్యత్తు ను వరల్డ్ క్లాస్ వి ఎఫ్ ఎక్స్ ద్వారా సృష్టించి ప్రేక్షకులకు ఒక అద్భుతమైన లోకంలో తీసుకెళ్లడానికి ఖర్చుకి నిర్మాతలు వెనుకాడలేదు. నిర్మాత జాకీ భగ్నని సినిమాలో క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా తెరకెక్కించారు.

ఈ సందర్భంగా నిర్మాత జాకీ భజ్ఞని మాట్లాడుతూ, ” గణపధ్ ట్రైలర్ కు, ఫస్ట్ సాంగ్ కు వస్తున్న ఈ పాజిటివ్ రెస్పాన్స్ చూస్తుంటే పడ్డ కష్టం అంతా మర్చిపోయి, ప్రేక్షకుల అంచనాలు అందుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అక్టోబర్ 20న విడుదల కానున్న సినిమా ను కూడా ఇలాగే ఆదరిస్తారని, నమ్మకంగా ఉంది.” అన్నారు.

గణపధ్ ట్రైలర్ ను చూసిన ప్రేక్షకులు టైగర్ ష్రాఫ్ మ్యాచో ఫైట్స్, కృతి సనన్ చేసిన స్టన్నింగ్ యాక్షన్, లెజెండ్ అమితాబ్ బచ్చన్ ముఖ్య పాత్రలో ఉండటంతో అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి.

గణపధ్ : ఏ హీరో ఇస్ బార్న్ ప్రసిద్ధ పూజ ఎంటర్టైన్మెంట్, గుడ్ కో తో కలిసి వికాస్ బహ్ల్ దర్శకత్వంలో దేనికి రాజీ పడకుండా నిర్మించారు. ఈ చిత్రాన్ని వశు భగ్నాని, జాకీ భాగ్నని, దీప్శిక దేష్ముఖ్, వికాస్ బహ్ల్ కలిసి నిర్మించారు. దసరా కానుకగా ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 20న హిందీ, తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో భారీ ఎత్తున విడుదలకు సిద్ధం అవుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News