Sunday, April 6, 2025

ఒక వైపు వర్షం… మరో వైపు నిమజ్జనం…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: హుస్సేన్‌సాగర్, సరూర్‌నగర్ ప్రాంతాలలో ఒక వైపు వర్షం పడుతున్న మరో వైపు గణనాథులను భక్తులు నిమజ్జనం చేస్తున్నారు. బాలాపూర్ గణపతి 13వ క్రేన్ వద్ద హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేశారు. ఖైరతాబాద్ గణనాథుడు గంగమ్మ ఒడిలోకి చేరుకున్నాడు. భారీ క్రేన్ సహాయంతో హుస్సేన్‌సాగరంలో ఖైరతాబాద్ గణపతిని నిమజ్జనం చేశారు. గణనాథుల నిమజ్జనంతో కోలాహలంగా హుస్సేన్‌సాగర్ పరిసరాలు ఉన్నాయి. భక్తులతో ట్యాంక్‌బండ్ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. నిమజ్జనోత్సవం చూసేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. చిరు జల్లులు వర్ష పడుతున్న భక్తులు గణనాథులను హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేస్తున్నారు. చార్మినార్ వద్ద గణేశ్ శోభాయాత్రలో కేంద్రమంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి పాల్గొన్నారు. గణనాథులపై సాధ్వి పూలు చల్లి భక్తులను ఉత్సాహపరిచారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News