Sunday, December 22, 2024

‘గాండీవధారి అర్జున’ టీజర్ విడుదల..

- Advertisement -
- Advertisement -

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ అడ్వెంచర్ ప్రాజెక్టు ‘గాండీవధారి అర్జున’. తాజాగా ఈ మూవీ టీజర్ ను విడుదల చేసింది చిత్రయూనిట్. హాలీవుడ్ రేంజ్ లో ఉన్న టీజర్ అభిమానులను ఆకట్టుకుంటోంది.

టీజర్ తో ఈ మూవీపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఎస్ విసిసి బ్యానర్ పై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో వరుణ్ కు జోడీగా ‘ఏజెంట్’ ఫేం సాక్షి వైద్య హీరోయన్ గా నటిస్తోంది. మిక్కీజె మేయర్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News