Sunday, December 22, 2024

‘గాండీవధారి అర్జున’ చూసినప్పుడు సమాజం గురించి ఆలోచిస్తాము

- Advertisement -
- Advertisement -

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయకుడిగా నటించిన యాక్షన్ అండ్ ఎమోషనల్ థ్రిల్లర్ ‘గాండీవధారి అర్జున’. సాక్షి వైద్య హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని స్టైలిష్ ఫిల్మ్‌మేకర్ ప్రవీణ్ సత్తారు తెరకెక్కించారు. శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై బివిఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా గాండీవధారి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు.

ఈ ఈవెంట్‌లో దిల్‌రాజు మాట్లాడుతూ “ప్రవీణ్ మేకింగ్, మిక్కీ సౌండ్ అద్భుతంగా ఉంది. విరూపాక్ష మూవీతో ఈ బ్యానర్ ఈ సినిమాకు ముందు ఓ హిట్ కొట్టింది. ఇప్పుడు వారికి మరో హిట్ రాబోతోంది”అని తెలిపారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మాట్లాడుతూ “సోషల్ మెసేజ్ ఉన్న సినిమాలు, అలాంటి కథలు అరుదుగా వస్తాయి. ఈ సినిమాలోని కోర్ పాయింట్ వల్లే ఒప్పుకున్నాను. ఎప్పుడూ మన కుటుంబం గురించి ఆలోచిస్తుంటాం. కానీ ఇలాంటి సినిమాలు చూసినప్పుడు సమాజం గురించి ఆలోచిస్తాము. అలాంటి ఆలోచనలు రావాలనే ఈ సినిమాను తీశాం. అవగాహన కల్పించాలనే ఈ చిత్రాన్ని తీశాం”అని అన్నారు. చిత్ర దర్శకుడు ప్రవీణ్ సత్తారు మాట్లాడుతూ…

“యాక్షన్ సినిమాలు తీసేటప్పుడు వచ్చే కిక్కే వేరు. ఎమోషన్స్, హై ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్‌లతో ఈ సినిమాను తీశాం. గ్లోబల్ ఇష్యూ మీద ఈ సినిమాను తెరకెక్కించాను. ఇది హీరో బేస్డ్ కథ కాదు. కథలో ఓ భాగంగా హీరో ఉంటాడు. కథలో తన పాత్ర బాగుంటే సినిమాలు చేస్తాడు వరుణ్ తేజ్. నా మనసుకు నచ్చిన సినిమా ఇది”అని పేర్కొన్నారు. చిత్ర నిర్మాత బివిఎస్‌ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ “వరుణ్‌తేజ్‌తో మేము ఇది వరకు చేసిన తొలి ప్రేమ సినిమా పెద్ద హిట్ అయింది. ఇప్పుడు ఈ సినిమా కూడా హిట్ అవుతుందని ఆశిస్తున్నాం”అని పేర్కొన్నారు. ఈ వేడుకలో శ్రీకాంత్ అడ్డాల, అనిల్ రావిపూడి, సాక్షి వైద్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News