Thursday, January 23, 2025

సైన్స్ ఫిక్షన్ మూవీ

- Advertisement -
- Advertisement -

సందీప్ మాధవ్, గాయత్రి ఆర్. సురేష్ జంటగా నటించిన చిత్రం ‘గంధర్వ’. ఫన్నీ ఫాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై యఎస్.కె. ఫిలిమ్స్ సహకారంతో యాక్షన్ గ్రూప్ సమర్పిస్తున్న చిత్రమిది. అఫ్సర్‌ని దర్శకుడిగా పరిచయం చేస్తూ సుబాని నిర్మించిన ఈ చిత్రం ఈనెల 8న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ముందుగా కొన్ని ప్రాంతాల్లో యూత్‌కు ప్రివ్యూ ప్రదర్శించారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటైన పాత్రికేయుల సమావేశంలో చిత్ర దర్శకుడు అఫ్సర్ మాట్లాడుతూ “ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్‌కు అనూహ్య స్పందన వచ్చింది. సినిమాలోని క్లైమాక్స్ అందరినీ మెప్పించేలా ఉంటుంది. ఫస్ట్ కాపీ చూశాక సురేష్ కొండేటి ఈ సినిమాను విడుదల చేస్తానని అనడం మాకు మొదటి విజయంగా భావించాం. ఖమ్మం, విజయవాడ, వైజాగ్‌లలో ప్రివ్యూ వేశాం. అద్భుతమైన స్పందన వచ్చింది”అని అన్నారు. హీరో సందీప్ మాధవ్ మాట్లాడుతూ సైన్స్ ఫిక్షన్ కథతో తెరకెక్కిన ఈ మూవీ ప్రేక్షకులకు కొత్త అనుభూతినిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో యస్.కె. ఫిలింస్ అధినేత సురేష్ కొండేటి పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News