అతిశయోక్తులు, పగలు, ప్రతీకారాలు వంటివి లేకుండా నిజానికి దగ్గరగా సరికొత్త లోకంలోకి తీసుకెళ్లి అందరినీ మెప్పించేలా గంధర్వ చిత్రం తీశానని దర్శకుడు అఫ్సర్ తెలియజేశారు. సందీప్ మాధవ్, గాయత్రి ఆర్. సురేష్ జంటగా నటించిన చిత్రం ‘గంధర్వ’. ఫన్నీ ఫాక్స్ ఎంట్‌ట్రైన్‌మెంట్ బ్యానర్‌పై ఎస్‌కె ఫిలిమ్స్ సహకారంతో యాక్షన్ గ్రూప్ సమర్పిస్తున్న చిత్రమిది. అఫ్సర్‌ని దర్శకుడిగా పరిచయం చేస్తూ సుబాని నిర్మించిన ఈ చిత్రం జూలై 1న విడుదలకానుంది. ఈ సందర్భంగా దర్శకుడు అఫ్సర్ మీడియాతో మాట్లాడుతూ.. “సినిమా కథ విషయానికొస్తే… 1971లో యుద్ధం జరుగుతుంది. దాని కోసం హీరో ఓ ప్రాంతానికి వెళ్లాలి. అయితే ఆర్మీ నేపథ్యం అనేది సినిమాలో కేవలం ఐదు నిమిషాలే ఉంటుంది. ఇది యూత్‌కు బాగా నచ్చే సినిమా. ఫ్యామిలీ ఎమోషన్స్, కామెడీ ట్రాక్స్, సైన్స్ గురించి ఆలోచించేవారు, సస్పెన్స్ థ్రిల్లర్‌లను ఇష్టపడేవారికి ఈ సినిమా బాగా నచ్చుతుంది. మాస్ మసాలా, దేశ భక్తి అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి. ఇక ప్రస్తుతం రెండు కథలు సిద్ధంగా ఉన్నాయి. ‘గంధర్వ’ రిలీజ్ అయ్యాక పెద్ద నిర్మాణ సంస్థలో ఒక సినిమా త్వరలో ప్రారంభమవుతుంది” అని అన్నారు.
Gandharwa Movie to Release on July 1st