Friday, November 22, 2024

దేశంలో ఒకటి మోడీ వర్గం.. రెండోది గాంధీ వర్గం: రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మెజారిటీ, మైనారిటీ ఇద్దరు ప్రభుత్వానికి రెండు కళ్లలాంటి వారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. హిందు, ముస్లిం భాయి, భాయి అన్నదే కాంగ్రెస్ విధానమన్నారు. రవీంద్రభారతిలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా జాతీయ విద్యా దినోత్సవం పురస్కరించుకొని వేడుకలు జరిగాయి. ఈ వేడుకలలో పాల్గొన్న రేవంత్ రెడ్డి ప్రసంగించారు. మైనారిటీ సంక్షేమం కోసం ప్రభుత్వం ఆహర్నిశలు శ్రమిస్తోందని, దేశంలో రెండు వర్గాలు ఉన్నాయని, ఒకటి మోడీ వర్గం కాగా రెండోది గాంధీ వర్గం ఉందన్నారు. స్వాతంత్య్రం రాగానే మౌలానా అబుల్ కలామ్‌ను దివంగత మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ విద్యాశాఖ మంత్రిని చేశారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. విద్యా వ్యవస్థలో మౌలానా అబుల్ కలామ్ అనే విధానాలు తీసుకొచ్చారని ప్రశంసించారు. గతంలో చార్మినార్ వద్ద దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర చేశారని, అదే చార్మినార్ వద్ద రాహుల్ గాంధీ కూడా సద్భావన యాత్ర చేశారని, నాలుగు ఎంఎల్‌సిలలో ఒకటి మైనారిటీలకు ఇచ్చామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీలకు అనేక పదవులు ఇచ్చిందని రేవంత్ రెడి తెలియజేశారు. ఉపధ్యాయులకు, సామాజిక వేత్తలకు ముఖ్యమంత్రి అవార్డులు ఇవ్వనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News