Monday, January 20, 2025

విద్యుత్ వెలుగుల్లో మెరిసిపోతున్న గాంధీభవన్

- Advertisement -
- Advertisement -

నగరంలో కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు అంబరాన్ని అంటాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలిసారి ఆ పార్టీ అధికారం చేపట్టబోతుండడంతో ఇంతకాలంలో నైరాశ్యంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల్లో ఒక్కసారిగా జోష్ నిండుకుంది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా 10 ఏళ్ల తర్వాత తొలిసారి అధికారం చేపట్టబోతుండడంతో గాంధీ భవన్ విద్యుత్ వెలుగులతో మెరిసిపోతోంది. ఇంతకాలం బోసిన గాంధీ చుట్టూ వెలుగులు విరజిమ్ముతున్నాయి.

మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని తానై పార్టీని ముందుంటి నడిపి విజయ తీరానికి చేర్చిన ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి పదవిలో ఆశ్సీనులు కానుండడంతో కాంగ్రెస్ శ్రేణులు మరింత సంతోషంలో మునిగి తేలుతున్నారు. రా్రష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అని ఢిల్లీ నుంచి ప్రకటన వెలువడిన మరు క్షణమే నగరంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున సంబురాలు చేసుకున్నారు. నగర వ్యాప్తంగా రోడ్లపైకి వచ్చి నినాదాలతో వీధులన్ని నినాదాలతో హోరెత్తించారు. టాపాకాయలను కాల్చి ఆనందంలో స్వీట్లు పంచుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News