Wednesday, January 22, 2025

స్టీరింగ్ కమిటీ మీటింగ్‌కు గాంధీ కుటుంబం దూరం

- Advertisement -
- Advertisement -

రాయపూర్(ఛత్తీస్‌గఢ్): ఎఐసిసి పీనరీ సమావేశాలు శుక్రవారం నుచి ఇక్కడ ప్రారంభమవుతున్న నేపథ్యంలో జరిగిన కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీ సమావేశానికి గాంధీ కుటుంబం నుంచి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ హాజరు కాలేదు. అయితే.. స్టీరింగ్ కమిటీని పూర్తి స్వేచ్ఛతో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నిర్వహించేందుకు వీలుగానే గాంధీ కుటుంబం నుంచి ఎవరూ స్టీరింగ్ కమిటీ సమావేశానికి హాజరుకాలేదని పార్టీ వర్గాలు తెలిపాయి. ఖర్గే బాధ్యతల నిర్వహణలో గాంధీ కుటుంబం జోక్యం లేదన్న సందేశాన్ని ప్రజలకు తెలియచేయాలన్నదే వారి ఉద్దేశమని వర్గాలు వెల్లడించాయి.

లేని పక్షంలో ఖర్గే కేవలం ఒక రబ్బరు స్టాంపు అన్న భావన ప్రజలలో ఏర్పడే అవకాశం ఉందని వారు చెప్పారు. శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటలకు గాంధీ కుటుంబ సభ్యులు రాయపూర్ చేరుకుంటారని ఛత్తీస్‌గఢ్ పిసిసి అధ్యక్షుడు మోహన్ మార్కం తెలిపారు. ఆరోగ్య సమస్యల కారణంగానే గాంధీ కుటుంబం స్టీరింగ్ కమిటీ సమావేశంలో పాల్గొనలేకపోయినట్లు మార్కం తెలిపారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులను ఎంపిక చేసుకోవడానికి ఎన్నికలు నిర్వహించాలా వద్దా అన్న విషయంపై స్టీరింగ్ కమిటీ చర్చించనున్నది. స్టీరింగ్ కమిటీ సమావేశం నిర్వహణతో 85వ కాంగ్రెస్ పార్టీ ప్టీనరీ సమావేశాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News