Friday, November 15, 2024

గాంధీలో నాన్‌కోవిడ్ సేవలకు సిద్ధం

- Advertisement -
- Advertisement -

Gandhi Hospital to reopen for non-covid services

ఈనెల 19 నుంచి ప్రారంభించేందుకు ఏర్పాట్లు వేగం
పరికరాలు, పడకలు, వార్డుల మరమ్మత్తులు
సిబ్బంది అందుబాటులో ఉండాలని అధికారుల ఆదేశాలు
ఆసుపత్రి పనులను పర్యవేక్షిస్తున్న వైద్యశాఖ ఉన్నతాధికారులు

హైదరాబాద్: నగరంలో కరోనా వైరస్ తగ్గుముఖం పట్టడంతో కోవిడ్ నోడల్ కేంద్రమైన గాంధీ ఆసుపత్రిలో ఈనెల 19 నుంచి పేద ప్రజలకు వైద్య సేవలందించే నాన్ కోవిడ్ సేవలు ప్రారంభిస్తున్నట్లు ఆసుపత్రి ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. ఏప్రిల్ 6వ తేదీ నుంచి పూర్తిగా ఆసుపత్రి కరోనా రోగులకు చికిత్స అందించడంతో సాధారణ రోగులు ఇబ్బందులు పడుతున్నారు. గ్రేటర్ చుట్టు పక్క జిల్లాలకు చెందిన ప్రజలు ఏలాంటి వైద్యం చేయించుకోవాలని గాంధీ వచ్చేవారు. ఇకా శస్త్రచికిత్స చేయించుకోవాల్సి రోగులు కోవిడ్ కారణంగా వారికి ఆపరేషన్లు వాయిదా వేయడంతో వైరస్ తగ్గుముఖం పట్టగా చికిత్సలు చేయాలని వైద్యాధికారులను కోరుతున్నారు. వారు కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లి వైద్యం చేయించుకునే పరిస్దితి లేదు ప్రాణాలు నిలవాలంటే గాంధీ ఆసుపత్రే పెద్ద దిక్కుని పలువురు పేదలు పేర్కొంటున్నారు.

గాంధీలో ఓపి సేవలు లేకపోవడంతో నగరానికి చెందిన ప్రజలంతా ఉస్మానియా వెళ్లడంతో అక్కడ రోగుల రద్దీ పెరిగింది. అక్కడ వైద్యులు కూడ గాంధీ ఆసుపత్రిలో నాన్‌కోవిడ్ సేవలు ప్రారంభించాలని కోరుతుండటంతో వైద్యశాఖ ఉన్నతాధికారులు ఆదిశగా ప్రయత్నాలు వేగం చేసినట్లు గాంధీ ఆసుపత్రి వైద్యాధికారులు వెల్లడిస్తున్నారు. నగరంలో బారీ వర్షాలు కురువడంతో సీజనల్ వ్యాధులు విజృంభించి వేలాదిమంది వైద్యం కోసం బస్తీ దవఖానాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాలకు వెళ్లడం అక్కడ సరైన వైద్యం అందకపోవడంతో గాంధీలో సేవలు అందుబాటులోకి తేవాలని కోరుతున్నారు. దీంతో ఆసుపత్రి అధికారులు గతంలో ఉన్నట్లు క్యాజువాలిటీ, ఓపి, ఐపీ భవనాల్లో సాధారణ రోగులకు సేవలు అందిస్తామని, రెండవ అంతస్దుతో పాటు లైబ్రరీ భవనంలో కోవిడ్ రోగులతో ,బ్లాక్‌పంగస్ రోగులకు చికిత్స చేస్తామని, అదే విధంగా థర్డ్‌వేవ్ వస్తే ఎదుర్కొనేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడిస్తున్నారు. అదే విధంగా మెడికల్ విద్యార్దులు కూడా క్లినిక్ శిక్షణలో వెనకబడుతామని, త్వరలో సేవలు ప్రారంభించి తనకు తర్పీదు ఇవ్వాలని అధికారులను కోరుతున్నారు.

గాంధీ ఆసుపత్రి రోగులకు నాణ్యమైన వైద్యం అందిచేందుకు నూతన పరికరాలు, పడకలు, స్టెచర్లు, వార్డుల్లో మరుగుదొడ్లు పూర్తిగా కొత్తవి ఏర్పాటు చేశారు. సిబ్బందిని కూడా కోవిడ్‌వార్డు, పోస్టు కోవిడ్ వార్డులకు ప్రత్యేక నియమిస్తున్నట్లు, వారు ఇతర వార్డులోకి రాకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. 150 పడకలు కోవిడ్ , 100 పడకలు పోస్ట్ కోవిడ్, 900 పడకలు సాధారణ రోగుల కోసం సిద్దం చేస్తున్నట్లు గాంధీ వైద్య సిబ్బంది పేర్కొంటున్నారు. శాశ్వత ఉద్యోగులతో పాటు, కాంట్రాక్టు ఉద్యోగులంతా అందుబాటులో ఉండాలని సూచిస్తున్నారు. గాంధీలో వైద్యసేవలు ప్రారంభిస్తే ఉస్మానియా,ఫీవర్ ఆసుపత్రులతో పాటు పట్టణ ఆరోగ్య కేంద్రాల, బస్తీదవాఖానలకు భారం తగ్గుతుందని సిబ్బంది పేర్కొంటున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News