Wednesday, January 22, 2025

జాతీయ రహదారి 65 ఫ్లై ఓవర్ నిర్మాణం పనులను పరిశీలించిన గాంధీ

- Advertisement -
- Advertisement -

శేరిలింగంపల్లి: నిత్యం రద్ధిగా ఉండే జాతీయ రహదారి పై నిర్మిస్తున్న ప్లై ఓవర్ పనులతో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వ విప్ శేరిలింగంపల్లి ఎమ్మేల్యే అరికెపుడి గాంధీ అన్నారు. జాతీయ రహదారి65 పై బీహెచ్‌ఈఎల్ చౌరస్తా వద్ధ 130.65 కోట్ల రూపాయల అంచన వ్యయంతో చేపడుతున్న ప్లై ఓవర్ నిర్మాణంలో భాగంగా జరుగుతున్న సర్వీస్ రోడ్డు విస్తరణ మరియు వదర నీటి కాల్లల నిర్మాణం పనులన ఆయన శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మేల్యే గాంధీ మాట్లాడుతూ ప్రజా సౌకర్యార్థం నిర్మిస్తున్న ప్లై ఓవర్ నిర్మాణం పనులను వేగవంతం చేయాలని, అదేవిధంగా సర్వీస్ రోడ్డు మరియు వరద నీటి కాల్వ నిర్మాణం పనులు కూడా త్వరగా పూర్తి చేసి ప్రజలకు ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు.

సర్వీస్ రోడ్డులో తీసిన గుంతల చుట్ట వాహనదారులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా, ప్రమాదాలు జరుగకుండా రక్షణ వలయాలను ఏర్పాటు చేయాలని అదేవిధంగా ప్లై ఓవర్ నిర్మాణం పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఈ సందర్భంగా ఆయన అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు అక్బర్ ఖాన్, మల్లేష్ గుప్తా, గురుచరణ్ దుబే, రాజశేఖర్ రెడ్డి, నరేందర్ బల్లా, యశ్వంత్, అమిత్, అంజద్, సందీప్ రెడ్డి తదితరులు పాల్గోన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News