Monday, December 23, 2024

మనందరికీ గాంధీజీ స్ఫూర్తి: సత్యవతి

- Advertisement -
- Advertisement -

మహబూబాబాద్: స్వాతంత్య్ర ఉద్యమంలో సత్యం, అహింస మార్గం ఎంచుకుని మనందరికీ గాంధీజీ స్ఫూర్తిదాయకంగా నిలిచారని మంత్రి సత్యవతి రాథోడ్  కొనియాడారు. గాంధీ జయంతి సందర్భంగా మహాత్మా గాంధీ సేవలను రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ స్మరించుకున్నారు. జాతిపిత మహాత్మా గాంధీకి ఘనంగా నివాళులర్పించారు. మహాత్ముడి 154వ జయంతి సందర్భంగా సోమవారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని గాంధీ పార్క్ లోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి మంత్రి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగించారు. గాంధీజీ బోధనలు ప్రపంచ నాయకులకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. మహాత్ముడి జయంతి రోజున బాపూజీని స్మరించుకోవడం మనందరి బాధ్యతని చెప్పారు. అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చిన గొప్ప దార్శనికుడు గాంధీజీ అని, అహింసాతో తెలంగాణ రాష్ట్రాని సాధించిన నిజమైన గాంధేయవాది సిఎం కెసిఆర్ అని ప్రశంసించారు. ఆరోజు బ్రిటిష్ పాలన నుంచి భారతదేశ విముక్తి కోసం గాంధీ ఏ విధంగా పరితపించారో, సమైక్యపాలన నుంచి విముక్తి కోసం తెలంగాణ సాధన కోసం ప్రజలందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి, ఎవరితో సాధ్యం కానీ బంగారు తెలంగాణను సాధించారని మంత్రి పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ కుమారి అంగోత్ బిందు, శాసనసభ్యులు బానోత్ శంకర్ నాయక్, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు, మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ శశాంక, ఎస్పీ చంద్రమోహన్ ఇతర అధికారులు బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News