Thursday, January 23, 2025

గాంధీ ఫొటో మార్చం

- Advertisement -
- Advertisement -

కరెన్సీ నోట్లపై ఇతరుల బొమ్మలు ముద్రించే ప్రతిపాదనేది లేదు
వదంతులను కొట్టిపారేసిన ఆర్‌బిఐ

No Plans to Replace Mahatma Gandhi on Currency: RBI

న్యూఢిల్లీ : కరెన్సీ నోట్లపై మహాత్మా గాంధీ బొమ్మకు బదులుగా వేరే ప్రముఖుల చిత్రాలను ముద్రించే ప్రతిపాదన ఏదీ లేదని ఆర్‌బిఐ (భారతీయ రిజర్వు బ్యాంక్) స్పష్టం చేసింది. రానున్న రోజుల్లో కరెన్సీ నోట్లపై మహాత్మా గాం ధీ చిత్రాన్ని తొలగిస్తారని, వేరే వారి చిత్రాలను ముద్రిస్తారంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఇంకా రవీంద్రనాథ్ ఠాగూర్, ఎపిజె అబ్దుల్ కలాం ఫోటోలతో కూడిన నోట్లు త్వరలో విడుదల కానున్నాయంటూ కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్‌బిఐ స్పందించక తప్పలేదు. నోటుపై మహాత్మా గాంధీ చిత్రాన్ని మార్చే ప్రతిపాదన లేదని ఆర్‌బిఐ పేర్కొంది. నాథ్ ఠాగూర్, ఎపిజె అబ్దుల్ కలాం ఫోటోలతో నోట్లను విడుదల చేసే అంశాన్ని రిజర్వ్ బ్యాంక్ పరిశీలిస్తోందని ఒక వార్తా సం స్థ నివేదిక పేర్కొంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌పిఎంసిఐఎల్) గాంధీ, కలాం, ఠాగూర్‌ల వాటర్‌మార్క్‌లతో కూడిన రెండు నమూనా సెట్లను ఐఐటి ఢిల్లీకి చెందిన ప్రొఫెసర్ దిలీప్ సాహ్నికి పంపినట్లు నివేదిక పేర్కొంది. అయితే చాలా దేశాలు ఒకటి కంటే ఎ క్కువ మంది వ్యక్తులతో నోట్లను ఉపయోగిస్తున్నాయి. అ మెరికా, జపాన్ వంటి దేశాలు ఒకటి కంటే ఎక్కువ మంది వ్యక్తుల బొమ్మలతో నోట్లు ముద్రిస్తున్నాయి. అమెరికా డాలర్‌లో జార్జ్ వాషింగ్టన్ నుండి అబ్రహం లింకన్ వరకు ఉన్న చిత్రం కనిపిస్తుంది. అదే సమయంలో జపాన్ యెన్ లో కూడా చాలా చిత్రాలు కనిపిస్తాయి.
ఆర్‌బిఐ ఎంపిసి సమావేశం షురూ..

వడ్డీ రేట్లపై నిర్ణయం తీసుకునే ఆర్‌బిఐ (భారతీయ రిజ ర్వు బ్యాంక్) ఎంపిసి (ద్రవ్య విధాన కమిటీ) సోమవారం సమావేశం ప్రారంభించింది. మూడు రోజుల సమావేశం తర్వాత రెపో రేటుపై నిర్ణయం ప్రకటించనున్నారు. ద్రవ్యోల్బణం లక్షం పరిమితి దాటటడం వల్ల ఆర్‌బిఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని అంతా వేచిచూస్తున్నారు. ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఆధ్వర్యంలో ఎంపిసి సమావేశం ఫలితాలను బుధవారం మీడియాకు ప్రకటిస్తారు. ప్రతి రెండు నెలలకోసారి ఈ మూడు రోజుల స మావేశం జరుగుతుంది. ఆర్‌బిఐ ఎంపిసిలో మొత్తం 6 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో ముగ్గురు ప్రభుత్వ ప్రతినిధులు, మిగిలిన ముగ్గురు సభ్యులు గవర్నర్‌తో సహా ఆర్‌బిఐకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ఆర్‌బిఐ రెపో రేటు, రివర్స్ రెపో రేటుపై ఎంపిసి మూడు రోజుల సమావేశంలోనే నిర్ణయం తీసుకుంటారు. గత నెల మేలో రిజర్వ్ బ్యాంక్ అత్యవసర సమావేశం నిర్వహించి రెపో రేటును 0.40 శాతం పెంచింది. దీంతో రెపో రేటు 4 శాతం నుంచి 4.40 శాతానికి చేరింది. రెపో రేటు పెంపు కారణంగా గృహ రుణాల నుండి కార్ల రుణాల వరకు అంతా ఖరీదైనవిగా మారాయి. ఈ పరిస్థితిలో రెపో రేటు మళ్లీ పెరిగితే రుణాలు మరింత భారం అవుతాయి. ఏప్రిల్ నెల సిపిఐ ద్రవ్యోల్బణం ఎనిమిదేళ్ల గరిష్ఠ స్థాయి 7.79 శాతానికి చేరింది. ఇక టోకు ద్రవ్యోల్బణం వరుసగా 13వ నెల రెండు అంకెల్లో ఉంది. ఏప్రిల్ ఇది 15.8 శాతానికి పెరిగింది. వీటిని చూస్తే గరిష్ఠ స్థాయికి చేరాయి. టోకు ద్రవ్యోల్బణం ఆధారంగా ఆర్‌బిఐ రేట్లపై నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పుడు మరోసారి వడ్డీ రేట్లను పెంచే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. రెపో రేటు అంటే బ్యాంకులకు ఆర్‌బిఐ ఇచ్చే రుణాల రేటు, ఈ రుణంతో బ్యాంకులు ఖాతాదారులకు లోన్లు ఇస్తాయి. త క్కువ రెపో రేటు అంటే బ్యాంకు నుండి అనేక రకాల రు ణాలు చౌకగా మారతాయి. బ్యాంకులు చేసే డిపాజిట్లపై ఆర్‌బిఐ నుండి వచ్చే వడ్డీ రేటునే రివర్స్ రేటు అంటారు.

RBI Review Highlights

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News