Sunday, December 22, 2024

గాంధీ ఆసుపత్రి ముందు ఆక్టోబర్ 2న గాంధీ విగ్రహం ఆవిష్కరణ: మంత్రి తలసాని

- Advertisement -
- Advertisement -

Gandhi statue inauguration front of Gandhi Hospital

 

మన తెలంగాణ/సిటీ బ్యూరో:  గాంధీ ఆసుపత్రి వద్ద జాతిపిత మహత్మాగాంధీ విగ్రహం ఏర్పాటు పనులు చురుగ్గా సాగుతున్నాయని పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. గాంధీ జయంతి ఆక్టోబర్ 2వ తేదీన విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్లు ఆయన వెల్లడించారు. సోమవారం మున్సిపల్ పరిపాలన శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అరవింద్ కుమార్ తో కలిసి ఎంజిరోడ్ లోని గాంధీ విగ్రహంతో పాటు బన్సీలాల్ పేట లోని మెట్ల బావి వద్ద కొనసాగుతున్న అభివృద్ధి పనులు, గాంధీ హాస్పిటల్ ముందు నూతన గాంధీ విగ్రహం ఏర్పాటు పనులను పరిశీలించారు. పనులను మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించడంతో పాటు పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రూ. 2 కోట్ల వ్యయంతో గాంధీ హాస్పిటల్ ముందు 16 అడుగుల ద్యానంముద్రలో ఉన్న ఆకట్టుకునే విధంగా మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఏర్పాటుతో పాటు ఆ పరిసరాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఎంతో చరిత్ర కలిగిన ఎంజి రోడ్ లోని గాంధీ విగ్రహం వద్ద కూడా చేపట్టిన అభివృద్ధి పనులు చివరిదశకు చేరుకున్నాయని చెప్పారు. ఈ రెండు విగ్రహాలను కూడా అక్టోబర్ 2 న ప్రారంభించనున్నమన్నారు. మెట్లబావి పునరుద్దరణ, పరిసరాలలోని అన్ని భవనాలకు ఒకే రంగు వేయడం ద్వారా ఈ ప్రాంతం సరి కొత్తగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ హేమలత, మాజీ కార్పొరేటర్ అత్తిలి అరుణ గౌడ్, జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, డిసి ముకుందరెడ్డి, ఈఈసుదర్శన్, వాటర్ వర్క్ జిఎంరమణారెడ్డి, కల్పన, హెచ్‌ఎండికఅధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News