Thursday, January 23, 2025

అమెరికాలో జాత్యాహంకార విద్వేష కాండ

- Advertisement -
- Advertisement -

Gandhi statue vandalized in New York

న్యూయార్క్‌లో గాంధీ విగ్రహం ధ్వంసం
వారంలో రెండోసారి టార్గెట్
వీధి నిండా దూషణల రాతలు

న్యూయార్క్ : అమెరికాలోని న్యూయార్క్‌లో మహాత్మా గాంధీ విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. రెండు వారాల క్రితమే ఈ విగ్రహాన్ని పగులగొట్టారు. ఇప్పుడు గుర్తు తెలియని వ్యక్తులు భారీ సుత్తెలతో ఇతర పనిముట్లతో పూర్తిగా ధ్వంసం చేశారని వెల్లడైంది. ఇది జాత్యాహంకార విద్వేష ఘటన అని భావిస్తున్నారు. ఈ రెండు ఘటనలపై స్థానిక పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తెల్లవారుజామున విధ్వంసం జరిగింది. ఆరుగురు వ్యక్తులు పనిముట్లు తీసుకుని వచ్యిచ శ్రీ తులసీమందిర్ వద్ద ఉన్న విగ్రహం దెబ్బతీశారని వెల్లడైంది. ఈ రాదారిలో అక్కడక్కడ విద్వేషపూరిత రాతలు రాసి వెళ్లారని స్థానిక మీడియా తెలిపింది. ఇదే విగ్రహాన్ని తొలుత ఈ నెల 3వ తేదీన దుండగులు ధ్వంసం చేసి వెళ్లారు. ఇప్పుడు భారత స్వాతంత్య్ర దినోత్సవం మరుసటి రోజు తిరిగి దీనినే ధ్వంసం చేశారు. 25 నుంచి 30 ఏండ్లలోపు ఉన్న వ్యక్తులు విధ్వంసకాండకు పాల్పడినట్లు అక్కడి సిసిటీవీ కెమెరాలలోని వీడియోలతో స్పష్టం అయింది. ఘటన తరువాత దుండగులు అక్కడి నుంచి కిరాయికి తీసుకుని వచ్చిన మెర్సిడెస్ బెంజ్ కారులో ఉడాయించారని స్పష్టం అయిందని పోలీసులు తెలిపారు.

ఈ ఘటనను న్యూయార్క్ స్టేట్ అసెంబ్లీ సభ్యురాలు జెన్నిఫర్ రాజ్‌కుమార్ ఖండించారు. దుండగులను వెంటనే పట్టుకుని కఠినంగా చట్టప్రకారం శిక్షించాల్సి ఉందని డిమాండ్ చేశారు. ఈ విగ్రహం పూర్తిగా దెబ్బతిందని , ఇది చాలా బాధాకరమైన విషయం అన్నారు. విద్వేషశక్తులను ఏరిపారేసే దిశలో తమకు లభిస్తున్న పూర్తి మద్దతుతో తాము ముందుకు సాగుతామని, ఇకపై ఇటువంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటారని తెలిపారు. భారత జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాలపై విధ్వంసకారులు ఇటీవలి కాలంలో తరచూ దాడులకు దిగడం వాటిని ధ్వంసం చేయడం జరుగుతోంది. కెనడాలో ఈ ఏడాది జులై 14వ తేదీన గాంధీజీ విగ్రహం దెబ్బతింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో న్యూయార్క్‌లోనే మరో భారీ స్థాయి గాంధీ విగ్రహాన్ని దుండగులు పగులగొట్టి వెళ్లారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News