Monday, December 23, 2024

అత్యాచారం కేసులో ఆశారాం బాపూకి జీవిత ఖైదు

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్:   ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపూకు గాంధీనగర్ లోని సెషన్స్ కోర్టు జీవిత ఖైదును విధించింది. తన ఆశ్రమంలో శిష్యురాలిగా ఉన్న మహిళను నిర్బంధించి 2001 నుంచి 2006 మధ్య పలుమార్లు అత్యాచారం చేశారనే కేసులో ఆయనకు కోర్టు ఈ జీవిత ఖైదును ఖరారు చేసింది. ఆశారాంపై సూరత్ కు చెందిన ఒక మహిళ అత్యాచార ఆరోపణలు చేసింది. దీనిపై 2013లో ఆశారాంతో పాటు మరో ఏడుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 16 ఏళ్ల బాలికపై మరో అత్యాచారం కేసులో కూడా దోషిగా తేలిన ఆశారాం బాపూ ప్రస్తుతం రాజస్థాన్ లోని జోధ్ పూర్ జైల్లో ఉన్నారు. వేలాది మంది శిష్యులను సంపాదించుకున్న ఆశారాంకు విదేశాల్లో సైతం కేంద్రాలు ఉన్నాయి. అలాంటి వ్యక్తి అత్యాచార కేసుల్లో దోషిగా తేలి కటకటాలపాలు కావడం గమనార్హం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News