Sunday, December 22, 2024

యాక్షన్ మోడ్‌లో ‘గాండీవధారి అర్జున’..(వీడియో)

- Advertisement -
- Advertisement -

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా బ్రిలియంట్ ఫిల్మ్ మేకర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రానికి ‘గాండీవధారి అర్జున’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ‘విటి 12’గా గత ఏడాది అక్టోబర్‌లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. గురువారం వరుణ్ తేజ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. మోషన్ పోస్టర్‌ను గమనిస్తే మాస్క్ ధరించిన మనుషులు కొందరు ఓ రాజ భవనంలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తుంటారు. అలాంటి సందర్భంలో బాంబుల మోత, గన్ ఫైరింగ్ నడుమ వరుణ్‌తేజ్ యాక్షన్ మోడ్‌లో కనిపిస్తున్నారు.

ఈ మోషన్ పోస్టర్ గ్లింప్స్‌లోనే ‘గాండీవధారి అర్జున’ అనే టైటిల్‌ను తెలియజేశారు. ఇందులో వరుణ్‌తేజ్ సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్‌గా నటిస్తున్నారు. ఎదుటి వారిని ప్రమాదాల బారి నుండి కాపాడే రోల్‌లో వరుణ్ నటించడం వల్ల ఈ టైటిల్‌ను ఎంచుకున్నట్లు తెలుస్తుంది. మిక్కీ జె.మేయర్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై సీనియర్ నిర్మాత బివిఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News