Wednesday, January 22, 2025

చంద్రబాబు విడుదల కావాలని టిటిడిపి విఘ్నేశ్వర హోమం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ జాతయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుపై పెట్టిన అక్రమ కేసులను కోర్టులు కొట్టి వేయాలని, ఆయన వెంటనే జైలు నుంచి విడుదల కావాలని ఆకాంక్షిస్తూ తెలుగుదేశం పార్టీ నేతలు తమ తమ పద్దతిలో పూజలు నిర్వహిస్తున్నారు. ఏపి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సకల మత ప్రార్థనలు కొందరు నిర్వనిర్వహించగా గుడ్లవల్లేరు మండలం వేమవరం కొండాలమ్మ తల్లికి చీర, సారేను మరి కొందరు సమర్పించారు. ఇటు తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎన్‌టిఆర్ ట్రస్ట్ భవన్‌లో మంగళవారం విఘ్నేశ్వర హోమంను వేద పండితులతో కలిసి నిర్వహించారు. చంద్రబాబు నాయుడు జైలు నుంచి త్వరగా విడుదల కావాలంటూ ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు గణేశుడి పూజలు చేసి ప్రార్థించారు.

బాబుకు అవిజ్ఞాలు తొలిగి త్వరగా బయటికి రావాలని వారు ఆక్షాంక్షించారు. ఈ విఘ్నేశ్వర హోమం కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షురాలు కాట్రగడ్డ ప్రసూన, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శులు అజ్మీరా రాజు నాయక్, జక్కిలి ఐలయ్య యాదవ్, గడ్డి పద్మావతి, జివిజి నాయుడు, రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి సూర్యదేవర లత, సికింద్రాబాద్ పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు పి. సాయిబాబా, రాష్ట్ర పార్టీ బిసి సెల్ అధ్యక్షులు శ్రీపతి సతీష్, రాష్ట్ర పార్టీ ఎస్‌సి సెల్ అధ్యక్షులు పోలంపల్లి అశోక్, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు పెద్దోజు రవీంద్రాచారి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News