Monday, January 20, 2025

వినాయక నిమజ్జన ఊరేగింపులో హింసాకాండ

- Advertisement -
- Advertisement -

వినాయక ఇగ్రహ నిమజ్జన ఊరేగింపు సందర్భంగా బుధశారం రాత్రి రెండు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగి విధ్వంసకాండకు దారితీసింది. రెచ్చిమూకలు దుకాణాలు, వాహనాల విధ్వంసానికి పాల్పడడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. బుధవారం రాత్రి జరిగిన ఘటనలకు సంబంధించి 52 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ముందు జాగ్రత్త చర్యగా మాండ్య జిల్లాలోని నాగమంగళ పట్టణంలో నిషేధాజ్ఞలు విధించారు. మూకలు రాళ్లు రువ్వడంతో ఇద్దరు పోలీసులతోసహా పలువురు గాయపడ్డారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చిందని, అదనపు భద్రతా దళాలను పట్టణంలో మోహరించినట్లు వారు చెప్పారు. వినాయక విగ్రహ ఊరేగింపు సందర్భంగా బదరికొప్పలు గ్రామానికి చెందిన భక్తులు ఒక ప్రార్థనా స్థలానికి చేరుకున్న సమయంలో రెండు వర్గాల మధ్య మాటల యుద్ధం మొదలైనట్లు పోలీసులు తెలిపారు. కొందరు దుండగులు రాళ్లు రువ్వడంతో పరిస్థితి అదుపుతప్పిందని వారు చెప్పారు.

రెండు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగడంతో మూకలు దుకాణాలపై పడి విధ్వంసానికి పాల్పడ్డాయి. దుకాణాలకు, వాహనాలకు నిప్పెపెట్టాయి. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు స్వల్పంగా లాఠీచార్జీ చేశారు. సమాజంలో శాంతిని, సారస్యాన్ని దెబ్బతీయడానికి కొందరు దుండగులు హింసాకాండకు పాల్పడినట్లు ముఖ్యమంత్రి సిద్దరామయ్య గురువారం తెలిపారు. ఈ ఘటనలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని, మతపరంగా సమాజంలో చీలికలు తేవడానికి ప్రయత్నించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. కాగా..నాగమంగళ ఘటనలను మతపరమైన హింసగా చెప్పలేమని హోం మంత్రి జి పరమేశ్వర అన్నారు. క్షణికావేశంలో జరిగిన చర్యగా ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉండగా నాగమంగళలో బుధవారం రాత్రి రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలపై విచారణ చేపట్టాలని కేంద్ర మంత్రి శోభా కరండ్లాజె డిమాండు చేశారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతోందని ఆమె ఆరోపించారు. హిందువులకు వ్యతిరేకంగా కుట్ర పన్నేందుకు ముఖ్యమంత్రి సిద్దరామయ్య, కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నట్లు ఆమె ఆరోపించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News