Saturday, December 21, 2024

నేడు గంగ ఒడిలోకి గణపయ్య

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/సిటీ బ్యూరో: గ్రేటర్ హైదరాబాద్‌లో మంగళవారం జరుగనున్న వినాయక నిమజ్జనానికి అధికార యంత్రాంగం సర్వం సిద్దంచేసింది. ఖైరతాబాద్ గణపతికి ఉ. 6.30గం.లకు ప్రత్యేక పూజలు. మ.1.30 గం.లకు క్రేన్ నంబర్ 4 వద్ద ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం జరుగనుంది. హుస్సేన్‌సాగర్ వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేసిన అధికార యంత్రాం గం. హైదరాబాద్ నగరంలో పోలీసులు 25వేల మం ది బందోబస్తు ఏర్పాటు చేశారు. సిసి కెమెరాలు ఏర్పా టు చేయడంతో పాటు పలు ప్రాంతాల్లో మౌంటెడ్ కెమెరాలతో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది హుస్సేన్‌సాగర్‌లో 25 వేల నుంచి 30 వేల విగ్రహాలు నిమజ్జనమవుతాయని అధికారులు అంచనా వేస్తున్నా రు. ఖైరతాబాద్ గణేశుడి విగ్రహాన్ని మధ్యాహ్నం 1. 30 గంటలలోపు నిమజ్జనం చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.

సాయంత్రం 4 గంటల ప్రాంతం లో బాలాపుర్ వినాయకుడు హుస్సేన్ సాగర్ దగ్గరికి చేరుకునే అవకాశముంది. మహిళల భద్రతకు షీటీమ్స్‌ను రంగంలోకి దించుతున్నారు. హుస్సేన్‌సాగర్ పరిసర ప్రాంతాల్లోనే 12 షీటీమ్స్ పహారా కాయనున్నాయి. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి బుధవారం రాత్రి 11 గంటల వరకు భారీ వాహనాల ను, ప్రైవేటు ట్రావెల్స్ బస్సులను కూడా నగరంలోని అనుమతించరు. నిమజ్జన సమయంలో నగర వ్యా ప్తంగా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మొ త్తం 67 డైవర్షన్ పాయింట్లు ఏర్పాటు చేశారు. ప్ర జలంతా పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు వినియోగిస్తే నిమజ్జనం ప్ర శాంతంగా వీక్షించవచ్చని పోలీసు ఉన్నతాధికారు లు సూచించారు. అత్యవసర సమయాల్లో ట్రాఫిక్ హె ల్ప్ లైన్ నంబర్లు 9010203626, 8712660600, 040-27852482 కి ఫోన్ చేయొచ్చని తెలిపారు.

గ్రేటర్ ఏర్పాట్లు
మొత్తం 15 వేల మంది జీహెచ్‌ఎంసీ సిబ్బంది మూడు షిప్టుల్లో గణేష్ నిమజ్జనంలో పాల్గొంటారు. నగర పరిధిలో 468 క్రేన్స్, హుస్సేన్ సాగర్ వద్దనే 38 క్రేన్స్ ఏర్పాటు చేశారు. నేటి నుంచి మూడు రోజుల పాటు జీహెచ్‌ఎంసీ సిబ్బంది విధుల్లో ఉంటారు. 160 గణేష్ టీమ్స్ పనిచేయనున్నాయి. హైదరాబాద్ వ్యాప్తంగా 10 కంట్రోల్ రూమ్‌లు, జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూం ఉంటుంది. నిమజ్జనం మరుసటి రోజు అదనంగా మరో 500 మంది సిబ్బంది పనిచేస్తారు. నగరంలో 73 వినాయక పాండ్స్ అందుబాటులోకి తీసుకొచ్చారు. మూడు రోజులపాటు జీహెచ్‌ఎంసీ సిబ్బందికి సెలవులు రద్దు చేశారు.

మంత్రి పరిశీలన
నేడు గణేష్ నిమజ్జనం సంద్భంగా జిల్లా ఇంఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, హైదరాబాద్ నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మిలు లుంబిని పార్క్ నుంచి బోట్ లో వెళ్లి ఖైరతాబాద్ వినాయకుడు నిమర్జనం ఏర్పాట్లు దగ్గర ఉండి పరిశీలించనున్నారు..
ఖైరతాబాద్ గణపతి శోభాయాత్ర
మంగళవారం ఉదయం 6.30గంటలకు ఖైరతాబాద్ గణపతి శోభాయాత్ర ప్రారంభం కానుంది. ఇక్కడ 700 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. శోభాయాత్ర మార్గంలో 56 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటితో పాటు రహదారిపై ఉన్న సీసీటీవీ కెమెరాలతోనూ భద్రతను పర్యవేక్షించనున్నారు.

9 గంటలకు బాలాపూర్ వినాయకుడి శోభాయాత్ర
బాలాపూర్ వినాయకుడి వద్ద 220 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. 30 సీసీటీవీ కెమెరాలతో రాచకొండ పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు. వేలంపాట అనంతరం ఉదయం 9 గంటల సమయంలో శోభాయాత్ర ప్రారంభం కానుంది. 16కి.మీ ప్రయాణం అనంతరం ఎన్టీఆర్ మార్గ్కు చేరుకోనుంది.
పోలీసులకు ఆదేశాలు జారీ చేసిన సిఎం రేవంత్‌రెడ్డి
ట్యాంక్‌బండ్‌తో పాటు ప్రధాన మండపాలు, చెరువుల వద్ద ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలని సిఎం రేవంత్ పోలీసులను ఆదేశించారు. పర్యవేక్షణతో పాటు ప్రతి గంటకు ఒకసారి సిబ్బందికి కమాండ్ కంట్రోల్ నుంచి సూచనలు ఇచ్చి అలర్ట్ చేయాలని సిఎం రేవంత్ సూచించారు. సమస్యాత్మక ప్రాంతాలపై ఎక్కువ దృష్టి పెట్టాలని సిఎం ఆదేశించారు. బ్లైండ్ స్పాట్స్, హాట్ స్పాట్స్‌లకు సంబంధించి రికార్డు మెయింటెన్స్ చేయాలని సిఎం సూచించారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. నవరాత్రులు పూర్తి చేసుకున్న గణపయ్యను నిమజ్జనం చేసేందుకు నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే వినాయక విగ్రహాల నిమజ్జనం ఏర్పాట్లపై సిఎం రేవంత్ రెడ్డి సోమవారం కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో పోలీసులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు హైదరాబాద్ సిపి సివి ఆనంద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ట్యాంక్‌బండ్ సహా నగరంలో వినాయక నిమజ్జనాల కోసం ఏర్పాటు చేసిన చెరువుల వివరాలను కమిషనర్ సివి ఆనంద్ సిఎంకు వివరించారు. ఈ క్రమంలోనే గ్రేటర్ వ్యాప్తంగా నిమజ్జనాల పర్యవేక్షణ కోసం ట్యాంక్‌బండ్, మండపాలు, చెరువుల దగ్గర మొత్తం 733 సిసి కెమెరాలతో నిమజ్జన ప్రక్రియను పర్యవేక్షిస్తున్నట్లు సిపి ముఖ్యమంత్రితో తెలిపారు. అలాగే సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి వాటి పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించామని సిపి పేర్కొన్నారు. ఈ క్రమంలోనే వినాయక నిమజ్జనంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని సిఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News