Monday, December 23, 2024

అర్థరాత్రి 2 గంటల వరకు నడవనున్న మెట్రో రైళ్లు..

- Advertisement -
- Advertisement -

 Ganesh Immersion: Hyd Metro to extends train Timings on Friday

మన తెలంగాణ/హైదరాబాద్: నగరంలో గణేష్ నిమజ్జనం సందర్బంగా హైదరాబాద్ మెట్రో ప్రత్యేక సేవలు అందించనున్నట్లు ప్రకటించింది. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి అర్ధరాత్రి రెండుగంటల వరకు మెట్రో రైళ్ల అందుబాటులో ఉంటాయని మెట్రో ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి ప్రకటన విడుదల చేశారు. గణేష్ నిమజ్జనం రోజున ప్రయాణీకుల రద్దీ దృష్టా మెట్రో సర్వీసుల సమయాన్ని పొడిగిస్తున్నట్లు తెలిపారు. చివరి రైల్ 10వతేదీ రాత్రి ఒంటిగంటకు బయలుదేరి 2గంటలకు ఆఖరి స్టేషన్‌కు చేరుకుంటుందన్నారు. తిరిగి మరుసటి రోజు ఉదయం 6 గంటలకు నుంచి మెట్రో సర్వీసులు నడుస్తాయని చెప్పారు. ప్రయాణీకులు మెట్రో సిబ్బందికి సహాకరించి తమ గమ్యస్దానాలకు చేరుకోవాలని సూచించారు.

 Ganesh Immersion: Hyd Metro to extends train Timings on Friday

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News