Thursday, January 23, 2025

ఇంటి ముందుకే వినాయకుడి నిమజ్జనం వాహనాలు: తలసాని

- Advertisement -
- Advertisement -

Ganesh immersion vehicles in hyderabad

హైదరాబాద్: ఇంటి ముందే వినాయకుడి నిమజ్జనం వాహనాలను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు.  కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ బిలిటీ క్రింద ఫ్రీడమ్ ఆయిల్ కంపెనీ ఆధ్వర్యంలో రూపొందించిన మూడు వాహనాలను టిఎస్ ఫుడ్ చైర్మన్ రాజీవ్ సాగర్ తో కలిసి మంత్రి తలసాని ప్రారంభించారు. పర్యావరణ పరిరక్షణపై ప్రజలలో అవగాహన కల్పించే విధంగా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుందని, గణేష్ నవరాత్రుల సందర్భంగా 6 లక్షల మట్టి విగ్రహాలను పంపిణీ చేయడం జరిగిందని తలసాని తెలిపారు. మొట్టమొదటి సారిగా ఎకో ఫ్రెండ్లీ గణేష్ నిమజ్జనం వాహనాలను నగరంలో ప్రారంభించడం పట్ల నిర్వాహకులను మంత్రి అభినందించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News