Saturday, November 16, 2024

గణేశ్ మండపాల విద్యుత్ బిల్లు నేనే చెల్లిస్తా: గంగుల

- Advertisement -
- Advertisement -

మరోసారి ఔదార్యం చాటుకున్న మంత్రి గంగుల కమలాకర్

సొంతంగా కరీంనగర్ నియోజకవర్గం పరిధిలోని గణేశ్ మండపాల విద్యుత్ బిల్లుల చెల్లింపు

జిల్లాలోని 2697 విగ్రహాల నిమజ్జనానికి సకల సౌకర్యాల ఏర్పాట్లకు ఆదేశం

కలెక్టరేట్  సమీక్షలో మంత్రి గంగుల కమలాకర్

కరీంనగర్: రాష్ట్ర బిసి సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ మరోసారి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. ప్రతీ హిందువు ఎంతో భక్తి శ్రద్దలతో గణనాథుని కొలిచి, ఈ వేడుకలకు మరింత శోబాయమానం తీసుకొస్తున్నారన్నారు. భగవంతుడిపై అచంచల భక్తి విశ్వాసాలు ప్రదర్శించే మంత్రి గత కొన్నేళ్లుగా కరీంనగర్ నియోజకవర్గంలోని గణేశుడి మండపాల విద్యుత్ బిల్లుల్ని స్వయంగా సొంత డబ్బులతో చెల్లిస్తున్న విషయం తెలిసిందే. ఈ దపా సైతం కరీంనగర్ నియోజకవర్గం పరిదిలోని ప్రతీ గణేశుని మండపం విద్యుత్ ఖర్చులు తన సొంత నిధులతో చెల్లిస్తానని తెలియజేశారు. వాటి బిల్లుల్ని తనకు అందజేయాల్సిందిగా అదికార యంత్రాంగానికి సూచనలు చేశారు. ఇప్పటివరకూ ఎవరైన గణేష్ మండప నిర్వాహకులు విద్యుత్ బిల్లులు చెల్లించినచో వారికి తిరిగి ఇవ్వాల్సిందిగా కోరారు.

కరీంనగర్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో గణేశ్ నిమజ్జనం ఏర్పాట్ల పై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈ మేరకు మంత్రి గంగుల మాట్లాడారు. కరీంనగర్ పట్టణంలో దాదాపు 500 మండపాలు, జిల్లా మొత్తము 2697 మండపాలు ఏర్పాటు చేశారని, వాటి నిమజ్జన వేడుకల్లో ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. నీటి వనరుల వద్ద రక్షణ చర్యలు ఏర్పాటు చేయడంతో పాటు స్థానికులకు అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మంత్రి గంగుల తో పాటు నగర మేయర్ సునీల్ రావు, జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్, జిల్లా సి.పి సత్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ గరిమఅగ్రవాల్, ఆయా శాఖలకు సంబంధించిన అధికారులు హాజరయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News