Monday, January 20, 2025

నిమజ్జనం… హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/భాగ్యనగరం : హైదరాబాద్‌లో గణేశుడి నిమజ్జన సందర్భంగా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మంగళవారం ఉదయం 8 నుంచి ఎల్లుండి ఉదయం 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయి. హైదరాబాద్‌లో మొత్తం 67 డైవరర్సన్ పాయింట్లు ఏర్పాటు చేశారు. ప్రజలంతా పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు వినియోగించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. నిమజ్జన సమయాల్లో ట్రాఫిక్ హెల్ప్‌లైన్ నంబర్లను కూడా ఏర్పాటు చేశారు. గ్రేటర్ పరిధిలో సుమారు లక్ష వరకు గణేశ్ విగ్రహాలు ఏర్పాటు చేసినట్టు గుర్తించారు.. ట్యాంక్‌బండ్, ఎన్‌టిఆర్ మార్గ్, పివి మార్గ్‌లో నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు చేశారు.  నిమజ్జన సమయంలో సిటీ బస్సులకు ఆంక్షలు విధించారు. మెహదీపట్నం నుంచి వచ్చే బస్సు మాసబ్‌ట్యాంక్ వద్ద, కూకట్‌పల్లి నుంచి వచ్చే బస్సులు ఖైరతాబాద్ వద్ద నిలిపేశారు. సికింద్రాబాద్ నుంచి వచ్చే బస్సులు చిలకలగూడ క్రాస్ వరకు అనుమతి ఇచ్చారు. గడ్డ అన్నారం, సికింద్రాబాద్ నుంచి వచ్చే వాహనాలను ప్యాట్నీ, రాణిగంజ్ మీదుగా మళ్లిస్తున్నారు. ఈస్ట్‌జోన్ నుంచి వచ్చే వాహనాలను కూడా దారి మళ్లిస్తున్నారు. రామంతాపూర్, శివంరోడ్డు నుంచి వచ్చే వాహనాలను నారాయణగూడ మీదుగా మళ్లిస్తున్నారు.
టోలీచౌకి, రేతిబౌలి, మెహదీపట్నం, నుంచి వచ్చే వాహనాలను మాసబ్ ట్యాంక్, నిరంకారీ భవన్, ఇక్బాల్ మీనార్ మీదుగా మళ్లించారు. ఎఆర్ నగర్, పంజాగుట్ట నుంచి వచ్చే వాహనాలను మెహదీపట్నం వైపు మళ్లించారు.

భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమి తి ఆధ్వర్యంలో మంగళవారం పాతబస్తీలో జరిగే సామూహిక నిమజ్జనోత్సవానికి సర్వం సిద్ధమైయ్యింది. పదకొండు రోజుల పాటు వాడవాడల భక్తుల పూజలందుకున్న గణనాథుడు గంగాదేవి ఒడికి తరలి వెళ్ళనున్నాడు. ఇందు కోసం జీహెచ్‌ఎంసి, పోలీసులు, విద్యుత్, జలమండ లి, ఆర్టీసి, నీటిపారుదల, ఆరోగ్య, రోడ్లు భవనాలు తదితర ప్రభుత్వ శా ఖలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశాయి. నగర శివారు, రాచకొండ కమిషరేట్ పరిధిలోని బాలాపూర్ నుండి మహా శోభాయాత్ర ప్రారంభమవుతుంది. ఈనేపథ్యంలో రాచకొండ, హైదరాబాద్ పోలీసులు పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు.

బార్కాస్, కేశవగిరి, చాంద్రాయణగుట్ట పోలీసుస్టేషన్, బంగారు మైసమ్మ చౌరస్తా, మహబూబ్‌నగర్ చౌరస్తా, ఫారూక్‌నగర్, ఫలక్‌నుమా, ఇంజన్‌బౌలి, శంషీర్‌గంజ్, అలియాబాద్, సయ్యద్ అలీ చబుత్రా, శాలిబండ నాగులచింత చౌరస్తా వద్ద ప్రధాన శోభాయాత్రతో కలుస్తాయి. శోభాయాత్రపై ఆద్యంతం డేగ కళ్ళతో నిఘా కొనసాగనుంది. ఇప్పటికే మండప నిర్వాహకుల, ఉత్సవ సమితి ప్రతినిధులతో పోలీసులు పలు మార్లు సమావేశాలు నిర్వహించారు. సాధ్యమైనంత త్వరంగా వినాయకులను నిమజ్జనానికి తరలించాలని కోరారు.

పలు ప్రధాన కూడళ్ళలో ప్రత్యేక వాచ్ టవర్స్‌ను, రూప్‌టాప్ బందోబస్తుకు చర్యలు తీసుకున్నారు. రోడ్లు భవనాల అధికారులు పలు చోట్ల బారీ కేడ్లను, లాల్‌దర్వాజా మోడ్ వద్ద స్వాగత వేదిక ను సిద్ధం చేశారు. మరోవైపు రోడ్లకు మరమ్మతులు, పారిశుధ్యం, హై మాస్ట్ దీపాల వంటి పనులు పూరైయ్యాయి. జలమండలి అధికారులు ప్రత్యేక శిబిరాల ద్వారా మంచినీటి సాచెట్లను పంపిణీ చేయనున్నారు. బాలాపూర్ గణనాథుడు గుర్రం చెరువు కట్టపై గల శ్రీ కట్టమైసమ్మ దే వాలయం వద్ద చాంద్రాయణగుట్ట పోలీసులు, ఉన్నతాధికారులు ప్రత్యే క పూజలతో స్వాగతం పలుకనున్నారు. ముస్లీంలు, శాంతి సంఘం సభ్యులు గణనాథుడితో శోభాయాత్రలో పాల్గొని మతసామరస్యాన్ని చాటనున్నారు.

300 మందితో టీజీఎస్‌పీడీసీఎల్ ….

టీజీఎస్‌పీడీసీఎల్ చార్మినార్ డివిజన్ ఫలక్‌నుమా, చార్మినార్, మీరాలం సబ్ డివిజన్ల పరిధిలో మూడు వందల మంది ఉద్యోగులతో నిరంతరం అప్రమత్తంగా ఉంటున్నట్లు ఆ డివిజన్ డివిజనల్ ఇంజనీరు టి.లింగయ్య గౌడ్ తెలిపారు. శోభాయాత్రలో రోడ్డుకు అడ్డంగా ఉన్న కరెంటు తీగలను సవరించినట్లు వివరించారు. రాజన్నబావి వద్ద 150కెవి, మీరాలం వద్ద 350కెవి అదనపు ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అవసరమైన చోట విద్యుత్ నిలిపి వేయటం, ప్రారంభించటం జరుగుతందన్నారు. భక్తులు విద్యుత్ తీగలను, కరెంటు స్తంభాలను తాకవద్దని కోరారు.

స్వచ్ఛంద సంస్థల ప్రసాదాల వితరణ….

పలు స్వచ్ఛంద సంస్థలు, సామాజిక సంఘాలు శోభాయాత్రలో పా ల్గొనే భక్తులకు తీరొక్క రకాల ప్రసాదాలను అందజేసేందుకు దారి పొడవున ఏర్పాట్లు చేశాయి. సామూహిక నిమజ్జనోత్సవాన్ని తిలకించేందు కు వివిధ ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు ఆకలి, దప్పులను తీర్చేందు కు సిద్ధమైయ్యాయి. పోటా పోటీగా ప్రసాదాల పంపిణీ సాగనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News