Monday, December 23, 2024

తొలి పూజ గణపతికే..!

- Advertisement -
- Advertisement -

గణపతి మనకు తొలివేలుపు.  ఏ ఆధ్యాత్మిక క్రతువును తలపెట్టినా, మన ఇంట్లో ఏ శుభకార్యాన్ని సంకల్పించినా తొలి పూజ గణపతికే చేస్తాం. సంవత్సరంలో తొలి పర్వదినమైన వినాయక చవితినాడు ఆయన్ను వరసిద్ధి వినాయకునిగా పూజిస్తాం. వినాయకుడు అనే పేరు పలకగానే అంతులేని ఆనందం కలుగుతుంది. పసి బిడ్డల నుంచి పండు ముసలి వరకు అందరికీ ఇష్టదైవం గణేశుడే.

Ganesha 

మనకు ఐశ్వర్యం, సంతోషం, విద్యాబుద్ధులు ప్రసాదించేది బొజ్జ గణపయ్యే.  అరిషడ్వర్గాలను అరికట్టి  మోక్షసాధనకు మార్గం సుగమం చేసే వాడు లంబోదరుడు. అటువంటి వినాయకుణ్ణి భాద్రపద శుద్ధ చవితినాడు ఈ నెల సెప్టెంబర్ 13న వరసిద్ధి వినాయకునిగా పూజిస్తారు.

గణపతి నా దేవుడు. నా గోడు వింటాడు. నాకు ఏ కష్టం రాకుండా చూస్తాడని ప్రతి భక్తుడూ భావిస్తాడు. గణపతి ఆరాధనలో అనంతమైన ఆధ్యాత్మిక భావాలు నిక్షిప్తమై ఉన్నాయి. బలం, జ్ఞానం, ఐశ్వర్యం, ఆనందం ..ఈ నాలుగింటి పరిపూర్ణ దివ్యతత్వమే గణపతి స్వరూపం. బలవంతుల్లో అధికుడు, బలానికి అధిదేవత హేరంబుడు అని పార్వతికి శివుడు బోధించినట్లు హేరంబోపనిషత్తు వర్ణిస్తోంది. బలానికి ఏనుగు ప్రతీక అని చెబుతుంటాం. నాగాయుత బలుడు అంటే పదివేల ఏనుగుల బలం కలవాడని అర్థం. ఈ బిరుదు భీముడికి ఉంది. అంటే గజ వదనుడైన గణపతి బలానికి సంకేతంగా ఆ స్వరూపం ధరించాడు. అంతేకాకుండా గజం ఐశ్వర్యానికి సూచన. గజలక్ష్మిరూపానికి ఇరువైపులా ఏనుగులు ఉన్నట్లు ఆగమాలు వర్ణిస్తున్నాయి.

Ganapathi-of-clay

గణపతిని సంపదలకు దేవతగా, ప్రదాతగా భావిస్తారు. శివపార్వతుల తనయుడిగానే కాకుండా వివ శక్తుల ఏకరూపమైన పరబ్రహ్మగా గణపతిని ఆరాధించే ఉపాసనా సంప్రదాయాలున్నాయి.తెలివికి దేవుడిగా గణేశుని ఆరాధిస్తారు. అందుకే విద్యార్థులంతా గణపతిని ముందుగా కొలుస్తారు. కోరినివన్నీ ఇచ్చేవాడు కాబట్టి వరసిద్ధి వినాయకుడు అనే పేరు పొందాడు. దుఃఖం, అజ్ఞానం, దారిద్య్రం వంటి బాధలు ప్రగతికి అవరోధాలు. వీటినే విఘ్నాలు అంటాం. అలాంటి ఆటంకాలను పోగొడతాడు కనుకనే విఘ్నేశ్వరుడు అయ్యాడు. మనకు ఐశ్వర్యం, సంతోషం, విద్యాబుద్ధులు ప్రసాదించేది బొజ్జ గణపయ్యే. అరిషడ్వర్గాలను అరికట్టి మోక్షసాధనకు మార్గం సుగమం చేసే వాడు లంబోదరుడు. అటువంటి వినాయకుణ్ణి భాద్రపద శుద్ధ చవితినాడు ఈ నెల సెప్టెంబర్ 13న వరసిద్ధి వినాయకునిగా పూజిస్తారు. గణపతి రూపాలు ఎన్ని ఉన్నా వరసిద్ధి వినాయకుడే అందరికీ ఆరాధ్యదైవం. వినాయక చతుర్థి హైందవ సంస్కృతికి ప్రతీక.

Maha-Ganapathi9

జాతీయ సమైక్యతా పర్వదినం. కొండంత దేవుడికి కొండంత పత్రి తీసుకురాగలమా అంటూనే ప్రతిఒక్కరూ యథాశక్తిగా పత్రి ప్రధానంగా వినాయక పూజను నిర్వహిస్తారు. వాడవాడలా వినాయక నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుపుతారు. వరసిద్ధి వినాయకవ్రతం ఆచరించడం వేదకాలం నుంచి ఉంది. ద్వాపరయుగం నాటి వ్రతకథను పురాణ పరంగా చెప్పుకుంటున్నాం. వేదకాలంనాడు పరమాత్మ నిర్గుణుడు. అందుకే వినాయకుడు పసుపుముద్దగా, బంకమట్టి ముద్దగా పూజలందుకున్నాడు. తరువాతి కాలంలో ఏకాగ్రత కుదరడానికి వినాయకుని మట్టి ఆకృతులు రూపుదిద్దుకున్నాయి. తొమ్మిదిరోజుల పాటు భక్తుల పూజలందుకుని జలప్రవేశం చేసే వినాయకుడు ధనధాన్య సమృద్ధిని, పర్యావరణ పరిరక్షణపై అవగాహనను అందరికీ కల్పించాలని గణపతిని ప్రార్థిస్తూ వరసిద్ధి వినాయక వ్రతకల్పం పుస్తకాన్ని అందిస్తున్నాం. ఈ పుస్తకాన్ని చదువుతూ అందరూ పూజ చేసుకోవచ్చు.

Vinayaka (25)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News