Wednesday, January 22, 2025

బండ్లగూడలో రూ.1.26కోట్లు పలికిన వినాయకుడి లడ్డూ..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నగరంలోని బండ్లగూడలో వినాయకుడి లడ్డూ భారీ ధర పలికింది. బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీర్తి రిచ్మండ్ విల్లాలో వినాయకుడి లడ్డూ రికార్డు స్థాయిలో రూ.1.26కోట్లు పలికింది. ఇప్పటివరకు బాలాపూర్ గణేష్ లడ్డూ ధర రికార్డు స్థాయిలో పలికేది. గతేడాది బాలాపూర్ గణేష్ లడ్డూ రూ.24.60లక్షల ధర పలికింది.

ప్రస్తుతం బాలాపూర్ గణేష్ లడ్డూ ధరను బ్రేక్ చేస్తూ బండ్లగూడ వినాయకుడి లడ్డూ ధర రికార్డు స్థాయిలో రూ.1.26 కోట్లు పలికింది. కాగా, మరికొద్దిసేపట్లో బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం పాట ప్రారంభం కానుంది. లడ్డూ వేలంలో పోటీ పడేందుకు భారీగా తరలివస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News