Saturday, November 9, 2024

ఐఫోన్లను రూ. 8వేల నుంచి అమ్ముతున్నారు: సిపి

- Advertisement -
- Advertisement -

నేటి యాంత్రిక యుగంలో చిన్న పెద్ద తేడా లేకుండా అందిరి వద్ద సెల్ ఫోన్లు ఉంటున్నాయి. ఆ ఫోన్లను భద్రంగా పెట్టుకోవాల్సిన సమయం వచ్చేసింది. హైదరాబాద్ లో సెల్ ఫోన్లు చోరీ చేస్తున్న ముఠా గుట్టురట్టు అయింది. సెల్ ఫోన్లు చోరీ చేసి ఇతర దేశాలకు తరలిస్తున్న ముఠాను పట్టుకున్నారు. ఐదుగురు సూడాన్ దేశస్థులు సహా 17 మందిని అరెస్ట్ చేశారు. దక్షిణ మండల టాస్క్ ఫోర్స్ పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. నిందితులు వద్ద నుంచి రూ. 1.75 కోట్ల విలువైన 703 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

నిందితుల్లో 12 మంది హైదరాబాద్, ఐదుగురు సూడాన్ వాసులున్నారని సిపి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. చోరీకి గురైన, దెబ్బతిన్న సెల్ ఫోన్లను డిస్మెంటల్ చేసి జగదీశ్ మార్కెట్ లో విక్రయిస్తున్నారని ఆయన వెల్లడించారు. ఎలమంద రెడ్డి అనే వ్యక్తి జగదీశ్ మార్కెట్ లో కౌంటర్ పెట్టాడు. అక్కడ ఐఫోన్లను సైతం రూ. 8 వేల నుంచి అమ్ముతున్నారని సిపి తెలిపారు. సెల్ ఫోన్ల సముద్ర మార్గం ద్వారా సూడాన్ తరలిస్తున్నారు. విమానాశ్రయాల్లో నిఘ ఎక్కవు ఉంటుందని పడవల్లో తరలిస్తున్నారని స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News