Wednesday, January 22, 2025

బంగారు బిస్కెట్లు చోరీ చేసిన ముఠా అరెస్ట్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నగరంలో బంగారు బిస్కెట్లు చోరీ చేసిన ముఠాను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. నలుగురు వ్యక్తులు ఐటి అధికారుల ముసుగులో బంగారం చోరీకి పాల్పడుతున్నారు. మే 27న సికింద్రాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ముఠా చోరీకి పాల్పడింది. కార్ఖానాలో మధుకర్ కు చెందిన 1700 గ్రాముల బంగారం చోరీ చేశారు. మే 30న చోరీ కేసులో పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం గోవాకుచెందిన ముగ్గురు, మహారాష్ట్రకు చెందిన మరొకరిని అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి రూ. 45 లక్షల విలువైన బంగారం బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. చోరీ చేసిన మొత్తం సొత్తును పోలీసులు రికవరీ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News