Wednesday, January 22, 2025

టమాటాల దోపిడీ..వాహనంతో పరారీ

- Advertisement -
- Advertisement -

న్యూస్ డెస్క్: ఇప్పటివరకు బంగారం కోసం, నగదు కోసం దోపిడీలు చేయడం గురించి విన్నాం. బంగారం ధరలతో పోటీ పడుతున్న3,000 కిలోల టమాటాల కోసం ఒక కారునే హైజాక్ చేయడం గురించి మీకు తెలుసా.. అయితే ఈ వార్త చదవండి.

కర్నాటకలోని చిత్రదుర్గ జిల్లా చల్లకెరెకు చెందినమల్లేష అనే రైతు తన పొలంలో పండిన టమాటాను కోలార్ మార్కెట్‌లో విక్రయించడానికి ఒక బొలేరో వాహనాన్ని మాట్లాడుకున్నాడు. సాయంత్రం శివన్న అనే డ్రైవర్‌తో కలసి టమాటా లోడుతో వాహనంలో బయల్దేరాడు. రాత్రి 11 గంటల ప్రాంతంలో వాహనం తుముకూరు రోడ్డులోని సిఎంటిఐ జంక్షన్ దాటుతుండగా ప్రమాదవశాత్తు ముందున్న మహీంద్ర జైలో వాహనాన్ని ఢీకొంది. క్సైలో వాహనం అద్దం పగిలింది. అందులో ఉన్న ముగ్గురు వ్యక్తులు శివన్నతో వాగ్యుద్ధానికి దిగారు. దారుణంగా దుర్భాషలాడారు. రూ. 15,000 ఇవ్వాలంటూ వారు డిమాండు చేయడంతో అంత డబ్బు తమ వద్ద లేదని, తమను క్షమించి వదిలేయాలని శివన్న, మల్లేష వారిని బతిమాలారు. అయినప్పటికీ ఆ ముగ్గురూ వినలేదు.

ఇంతలో ఆ ముగ్గురిలో ఒక వ్యక్తి బొలేరో వాహనంలోకి ఎక్కి దాన్ని కెఆర్ పురం వైపు నడిపించాడు. జైలో వాహనం యజమానిని బలిమాలాడినప్పటికీ అత వినలేదు. శివన్న, మల్లేషంలను తోసివేసి బొలేరో వాహనంతో వారు పరారయ్యారు. శివన్న, మల్లేష ఆర్‌ఎంసి యార్డు పోలీసు స్టేషన్‌లో సంఘటన గురించి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు. నిందితులు దోచుకున్న టమాటాల విలువ రూ. 3 లక్షలు ఉంటుందని మల్లేష పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News