Monday, December 23, 2024

నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్.. మనీ ఈస్ట్ స్ఫూర్తితో కిడ్నాప్

- Advertisement -
- Advertisement -

gang inspired by Netflix's Money Heist kidnapped

మహిళను ఎరవేసి కిడ్నాప్
డబ్బుల ఇవ్వాలని బాధితుడి సోదరుడికి ఫోన్
వాట్సాప్ కాల్ చేసిన నిందితులు
అరెస్టు చేసిన ఆసిఫ్‌నగర్ పోలీసులు
వివరాలు వెల్లడించిన సిపి సివి ఆనంద్

హైదరాబాద్: నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమవుతున్న మనీఈస్ట్ వెబ్‌సిరీస్‌ను స్ఫూర్తిగా తీసుకుని కిడ్నాప్‌లు చేస్తున్న ముఠాను ఆసిఫ్‌నగర్ పోలీసులు అరెస్టు చేశారు. నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకోగా మహిళా నిందితురాలు పరారీలో ఉంది. నగర పోలీస్ కమిషనరేట్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపి సివి ఆనంద్ వివరాలు వెల్లడించారు. నగరంలోని అత్తాపూర్‌కు చెందిన గుంజపోగు సురేష్ అలియాస్ సూర్య అలియాస్ సూరి డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. మెహిదీపట్నం, వివేకానందనగర్, భోజగుట్టకు చెందిన రోహిత్, ఇందూరి జగదీష్ అలియాస్ జై హీరో,కె. కునాల్ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నారు, జగద్గిగిరిగుట్టకు చెందిన స్వేతాచారి అలియాస్ స్వీటీ కలిసి కిడ్నాప్‌లు చేస్తున్నారు. ప్రధాన నిందితుడు సురేష్ పేరుమోసిన దొంగ గుంజపోగు సుధాకర్‌కు సోదరుడు. సురేష్ సైబరాబాద్, రాచకొండ, హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో చోరీలు చేయడంతో వివిధ పోలీస్ స్టేషన్లలో 14 కేసులు నమోదయ్యాయి. 2019లో మియాపూర్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు.

నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం అవుతున్న మనీ ఈస్ట్ వెబ్ సిరీస్‌ను రోజు చూసేవాడు. దానిలో నిందితులు మాస్కులు వేసుకుని కిడ్నాప్‌లు చేసి డబ్బులు వసూలు చేస్తున్న విషయం మొత్తం అవగాహన చేసుకున్నాడు. దీనిని ఫాలో అవుతున్న సురేష్ వెబ్‌సిరీస్‌లో వలే ముఠాను తయారు చేశాడు, ఇందులో మహిళ కూడా ఉంది. తనకు తెలిసిన అమాయకులకు వాట్సాప్ ద్వారా మహిళలను ఎరగా వేసి వారిని కిడ్నాప్ చేసి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే నగరానికి చెందిన ప్రశాంత్ అనే యువకుడిని కిడ్నాప్ చేశారు. ప్రశాంత్ గుడిమల్కాపూర్ ఫ్లవర్ మార్కెట్‌లో పువ్వులను విక్రయిస్తుంటాడు. ఈ నెల 05వతేదీన 1.30గంటలకు ఇంటి నుంచి బయటికి వెళ్లిన ప్రశాంత్ తిరిగి రాలేదు. దీంతో తల్లి ఉషానమ్మ ఫోన్ చేసినా స్విఛ్ ఆఫ్ వచ్చింది, మరో కుమారుడితో కలిసి చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. ఈ క్రమంలోనే ప్రశాంత్ ఫోన్ నుంచి నిందితులు వాట్సాప్ కాల్ చేసి మాట్లాడారు. డబ్బులు తీసుకుని రావాలని లేకుండా ప్రశాంత్‌ను చంపివేస్తామని చెప్పారు. వెంటనే ఆసిఫ్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కిడ్నాప్‌ను ఛేదించేందుకు ప్రత్యేక టీమును ఏర్పాటు చేశారు. డిసిపి నోయల్ డేవిస్ ఆధ్వర్యంలో ఇన్స్‌స్పెక్టర్ రవీందర్, ఎస్సై స్రవంతి, పిసిలు కలిసి నిందితులను పట్టుకున్నారు.

యువతితో గాలం….

నిందితులు యువకులకు యువతితో గాలం వేసేవాడు,బాధితులకు యువతిలో వాయిస్ మెసేజ్‌లు, టెక్ట్ మెసేజ్‌లు వాట్సాప్‌లో పంపేవారు. వాటికి ఆకర్శితులైన వారిని ముగ్గులోకి దింపేవారు. వారిని నమ్మించి అమ్మాయితో వారు అనుకున్న ప్రాంతానికి పిలిపించేవారు. బాధితులు రాగానే వాహనంలో కిడ్నాప్ చేసేవారు. కిడ్నాప్ చేసే సమయంలో నిందితులు ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు మాస్కులు ధరించేవారు. లొకేషన్ పోలీసులు ట్రేస్ చేయకుండా వైఫైని ఉపయోగించి వాట్సాప్ కాల్‌ను మాట్లాడేవారు. కిడ్నాప్ చేసిన వారి బంధువులు ఇచ్చిన డబ్బులు తీసుకున్న తర్వాత విడిచిపెట్టేవారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News