నేరెడ్‌మెట్ బాలిక గ్యాంగ్ రేప్ కేసులో పదిమంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం…మేడ్చల్ జిల్లా, వినాయకనగర్‌కు చెందిన చక్కోలు నరేష్, సిరిపంగ విజయ్‌కుమార్ అలియాస్ విజయ్, మహారాష్ట్ర, లాతూర్‌కు చెందిన వగ్‌మారే బాలాజీ అలియాస్ బాలి, మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన గుడ్డాంటి కృష్ణ, మేడ్చల్ జిల్లాకు చెందిన తొంటే కిరణ్ కుమార్ అలియాస్ కిరణ్, బొల్లెపోగు అజయ్, జేమ్స్ జేవియర్, ఇంజమూరిమధు అలియాస్ బండ, వాగ్‌మారే దీపక్, సబావత్ హత్యా నాయక్ అలియాస్ బాలు. వీరు బాలికపై అత్యాచారం చేయడంతో గర్భం దాల్చింది. నిందితుల్లో ఏడుగురిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. కాచిగూడకు చెందిన బాలిక తండ్రి మూడేళ్ల క్రితం చనిపోయాడు. అప్పటి నుంచి బాలిక తల్లి ఇళ్లల్లో పనిచేసి కూతురిని పోషిస్తోంది. నాలుగవ తరగతి వరకు చదువుకున్న బాలిక తర్వాత చదువు ఆపివేసి ఇంట్లోనే ఉంటోంది.
బాలికకు నరేష్, విజయ్ ఫోన్‌లో స్నేహితులుగా మారారు. ఇద్దరితో తరచూ బాలిక ఫోన్‌లో మాట్లాడేది. ఈ క్రమంలోనే బాలికను ఇద్దరు నిందితులు బైక్‌పై కాచిగూడకు వచ్చి నేరెడ్‌మెట్‌కు తీసుకుని వెళ్లారు. అక్కడ కూల్‌డ్రింక్‌లో గంజాయి ఇచ్చే వారు. బాలిక స్పృహ కోల్పోవడంతో బాలికపై అత్యాచారం చేశారు. తర్వాత నిందితులు బాలిక నంబర్‌ను మిగతా నిందితులకు ఇచ్చారు. వారు కూడా బాలికను తీసుకుని కూల్‌డ్రింక్‌లో గంజాయి కలిసి ఇచ్చి వినాయకనగర్‌లోని చెట్ల పొదల్లోకి తీసుకుని వెళ్లి అత్యాచారం చేశారు. ఈ క్రమంలోనే బాలిక అనారోగ్యానికి గురికావడంతో బాలిక తల్లి, ఆస్పత్రిలో పరీక్షలు చేయించింది. పరిశీలించిన వైద్యులు బాలిక ఐదు నెలల గర్భవతి అని చెప్పారు. దీంతో ఒక్కసారిగా షాక్‌కు గురైన బాలిక తల్లి నిలదీయడంతో తనపై జరిగిన అఘాయిత్యాన్ని తల్లికి చెప్పింది.
వెంటనే కాచిగూడ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు కేసును నేరెడ్‌మెట్‌కు బదిలీ చేశారు. అక్కడ ప్రధాన నిందితులు నరేష్, విజయ్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. వారి ఇచ్చిన సమాచారంతో మిగతా నిందితులను అరెస్టు చేశారు. పదిమంది నిందితులు గంజాయికి బానిసలుగా మారి పక్కదారిపట్టారు. వీరిపై వివిధ పోలీస్ స్టేషన్లలో క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు నేరెడ్‌మెట్ ఇన్స్‌స్పెక్టర్ తెలిపారు.