Monday, December 23, 2024

నకిలీ సర్టిఫికెట్ల ముఠా అరెస్ట్..

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః విదేశాలకు వెళ్లే వారికి నకిలీ డిగ్రీ సర్టిఫికేట్లు ఇస్తున్న ముగ్గురు వ్యక్తులను సెంట్రల్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకోగా, మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. నిందితుల వద్ద నుంచి వివిధ యూనివర్సిటీలకు చెందిన నకిలీ డిగ్రీ సర్టిఫికేట్లు, కంప్యూటర్లు స్వాధీనం చేసుకున్నారు. చార్మినార్ ఎసిపి రుద్ర భాస్కర్ తన కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. చాంద్రాయణగుట్టకు చెందిన ఎండి కలీముద్దిన్, ఢిల్లీకి చెందిన శివాని(పరారీలో ఉంది), రాజేంద్రనగర్‌కు చెందిన ఎండి ఫిరోజ్, లంగర్‌హౌస్‌కు చెందిన అబ్దుల్ నగర్ కలిసి నకిలీ సర్టిఫికేట్లు తయారు చేసి ఇస్తున్నారు.

ప్రధాన నిందితుడు కలీముద్దిన్ ఏడోతరగతి వరకు చదువుకుని ఆర్థిక ఇబ్బందుల వల్ల మధ్యలో ఆపివేశాడు. తర్వాత డైమండ్ గ్రాఫిక్స్ ప్రింటింగ్ ప్రెస్‌లో డిటిపి ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు.అక్కడ పనిచేస్తున్న సమయంలో నకిలీ సర్టిఫికేట్ల తయారీని నేర్చుకున్నాడు. 2015లో ప్రింటింగ్ ప్రెస్ యజమానులతోపాబు కలీముద్ధిన్‌ను నకిలీ సర్టిఫికేట్ల కేసులో పోలీసులు అరెస్టు చేశారు. జైలు నుంచి విడుదలైన తర్వాత ఫిరోజ్‌తో కలిసి విదేశాలకు వెళ్లే వారిని టార్గెట్‌గా చేసుకుని నకిలీ సర్టిఫికేట్లు ఇస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇద్దరిని బాలాపూర్, పహాడీ షరీఫ్ పోలీసులు 2022లో అరెస్టు చేశారు. డిసెంబర్,2022లో జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత మళ్లీ నకిలీ సర్టిఫికేట్లను ఇస్తున్నాడు, ఇది తెలుసుకున్న ఫలక్‌నూమాకు చెందిన ఎండి శకీల్ అలీ విదేశాల్లో తను, తన భార్య ఉద్యోగం చేసేందుకు సర్టిఫికేట్లు ఇవ్వాలని కలీముద్దిన్‌ను కలిసి లక్షరూపాయలు ఇచ్చాడు.

అసలు సర్టిఫికేట్లు ఇస్తానని చెప్పి నకిలీ సర్టిఫికేట్లు ఇచ్చారని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులు ఉస్మానియా, ఆంధ్రా, ఛండీఘడ్ తదితర యూనివర్సిటీలకు చెందిన డిగ్రీలను అమెరికా, యూకేకు వెళ్తున్న వారికి ఇస్తున్నట్లు బయటపడింది. నిందితులను అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఇన్స్‌స్పెక్టర్ రాఘవేంద్ర, ఎస్సై దీన్‌దయాల్ తదితరలు పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News