Thursday, January 23, 2025

స్కూల్ వాష్ రూమ్‌లో విద్యార్థినిపై అత్యాచారం…

- Advertisement -
- Advertisement -

Gang rape in Student in Delhi schools

 

ఢిల్లీ: స్కూల్ వాష్ రూమ్‌లో 11 ఏళ్ల విద్యార్థినిపై ఇద్దరు సీనియర్ విద్యార్థులు అత్యాచారం చేసిన సంఘటన ఢిల్లీలోని కేంద్రీయ విద్యాలయంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… విద్యార్థిని క్లాస్ రూమ్‌కు వెళ్తుండగా ఇద్దరు సీనియర్లు ఎదురుపడ్డారు. విద్యార్థిని వాళ్లకు తాకడంతో ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె సారీ చెప్పి వెళ్తుండగా అమ్మాయిని తిట్టడంతో పాటు వాష్‌రూమ్‌లోకి లాక్కెళ్లారు. వాష్‌రూమ్ డోర్‌ను లాక్ చేసి అనంతరం ఆమెపై ఇద్దరు సీనియర్లు అత్యాచారం చేశారు. అదే విషయం టీచర్‌కు చెప్పడంతో పంతులమ్మ పట్టించుకోలేదు. ఈ విషయం ప్రిన్సిపాల్‌కు చేరడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరి నిందితులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. పాఠశాల ఆవరణంలో విద్యార్థులపై అత్యాచారం జరగడం ఏంటని? మానవ హక్కులు సంఘాలు ప్రశ్నించాయి. అమ్మాయిలకు స్కూళ్లలో రక్షణ కరువైందని పిల్లల తల్లిదండ్రులు వాపోతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News