Wednesday, January 1, 2025

మైనర్‌పై గ్యాంగ్‌ రేప్

- Advertisement -
- Advertisement -

గంజాయి మత్తులో ఇంట్లోకి దూరి మెడపై కత్తిపెట్టి మరీ దారుణం
బాలిక సోదరుడి ముందే నీచం
హైదరాబాద్‌లోని నందనవనంలో ఘటన

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో మరో దారుణం చోటు చేసుకుంది. నగరంలో ఇటీవల మూగ, చెవిటి మహిళపై అత్యాచారం జరిగిన ఘటన మరువక ముందే తాజాగా హైదరాబాద్‌లోని మీర్‌పేట్ నందనవనంలో ఓ మైనర్ బాలికపై గంజాయి మత్తులో ఉన్న యువకులు గ్యాంగ్ రేప్‌కు పాల్పడటం సంచలనంగా మారింది. గంజాయి మత్తులో ఉన్న యువకులు బాలిక ఇంట్లోకి దూరి మెడపై కత్తి పెట్టి బెదిరించి మరీ ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. బాలిక సోదరుడి ముందే యువకులు ఈ నీచానికి పాల్పడ్డట్లు సమాచారం. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితుల కోసం గాలిస్తున్నట్లు రాచకొండ సిపి డిఎస్ చౌహాన్ చెప్పారు. ఎనిమిది మంది నిందితులు పరారీలో ఉన్నారని వెల్లడించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News