Monday, December 23, 2024

యువతిపై సామూహిక అత్యాచారం!

- Advertisement -
- Advertisement -

Gang rape of a young woman!

జార్ఖండ్‌: బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి బైక్‌ రైడ్‌కు వెళ్లిన ఓ యువతిపై ఏకంగా పదిమంది సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. సింగ్‌భమ్‌ జిల్లాకు చెందిన 26 ఏండ్ల యువతి ప్రముఖ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నది. గురువారం సాయంత్రం తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి బైక్‌రైడ్‌కు వెళ్లింది. దారి మధ్యలో ఓ 10 మంది పోకిరీల గుంపు వారిని అడ్డగించింది. యువతి బాయ్‌ఫ్రెండ్‌ను చితకబాది పక్కన పడేసింది పోకిరి గుంపు. యువతిని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడింది. ఆ తర్వాత ఆమెను అక్కడే వదిలేసి ఆమె పర్సు, మొబైల్‌ ఫోన్‌ తీసుకొని నిందితులు పారిపోయారు. ఎలాగోలా ఇంటికి చేరుకున్న బాధితురాలు కుటుంబసభ్యులకు విషయం చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. యువతికి స్థానిక ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News