Thursday, January 23, 2025

ఆదివాసీ మహిళపై సామూహిక అత్యాచారం..

- Advertisement -
- Advertisement -

ఇంద్రవెల్లి : భిక్షాటన చేసి బస్ షెల్టర్ లో ఉన్న ఆదివాసీ మహిళపై సామూహిక అత్యాచారం, హత్యకు పాల్పడిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించినట్లు ఉట్నూర్ డిఎస్పీ నాగేందర్ తెలిపారు. గురువారం డిఎస్పీ కార్యాలయంలో కేసుకు సంబంధించి వివరాలు వెల్లడించారు. అదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని దనోర (బీ) గ్రామంలో ఓ ఆదివాసీ మహిళ ఈ నెల 20 భిక్షాటన చేసి రోడ్డు పక్కన ఉన్న బస్ షెల్టర్ వద్దకు వెళ్లి ఉంది. దనోర (బీ ) గ్రామానికి చెందిన సుముక్ రావ్ సంతోష్, పసారే సంతోష్, షేక్ ఖదీర్ ముగ్గురు కూడా మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయం గ్రామస్తులకు ఎక్కడ చెప్పుతుందోనని హత్య చేసి గ్రామానికి సమీపంలో ఉన్న వ్యవసాయ బావిలో పడేశారు.

ఈ ఘటన జరిగి నాలుగు రోజుల తర్వాత అటుగా వెళ్లిన గ్రామస్తులు మృతదేహాం ఉందని అందరికి తెలియడంతో పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి నార్నూర్ సీఐ ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో ఇంద్రవెళ్లి ఎస్త్స్ర సునీల్ తో పాటుగా 4బృందాలుగా ఏర్పడి విచారించడంతో గ్రామానికి చెందిన వ్యక్తులే అత్యాచారం చేసి, హత్య చేసినట్లు నిర్దారణ అయిందన్నారు. ముగ్గురు నిందితులను రెండు రోజుల్లో పట్టుకొని అరెస్ట్ చేసి వారిపై అత్యాచారం, హత్య, ఎస్‌సి, ఎస్‌టి చట్టాల కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో నార్నూర్ సిఐ ప్రేమ్ కుమార్, ఇంద్రవెళ్లి, ఉట్నూర్ ఎస్‌ఐలు సునీల్, భరత్ సుమన్ ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News