Monday, December 23, 2024

పదో తరగతి విద్యార్థినిపై సామూహిక అత్యాచారం

- Advertisement -
- Advertisement -

 

రంగారెడ్డి: పదో తరగతి విద్యార్థినిపై తోటి విద్యార్థులు సామూహిక అత్యాచారం చేసిన సంఘటన రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిని వివరాల ప్రకారం… మూడు నెలల క్రితం పదో తరగతి చదువుతున్న విద్యార్థినిపై తోటి విద్యార్థులు గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. అనంతరం నిందితులు వీడియో తీసి తోటి విద్యార్థులకు పంపించారు. ఈ విషయం ఎవరికైనా చెబితే సోషల్ మీడియాలో పెడుతామని బెదిరించారు. పది రోజుల క్రితం సదురు బాలికపై అత్యాచారం చేశారు. దీంతో బాలిక తల్లిదండ్రులతో కలిసి స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

స్మార్ట్ చేతిలో ఉండడంతో పిల్లలు ఫోర్న్ సినిమాలు ఎక్కువగా చూస్తున్నారు. ఫోర్న్ సినిమాలతో పిల్లలు చెడుమార్గం వైపు ప్రయాణిస్తున్నారు. పిల్లలు స్మార్ట్ ఫోన్లతో జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. టీనేజ్ వచ్చిన తరువాత పిల్లల అలవాట్లలో మార్పులను తల్లిదండ్రులు గమనించాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News