Saturday, January 4, 2025

బాలికపై బాబాయ్ మరో ముగ్గురుతో కలిసి గ్యాంగ్ రేప్

- Advertisement -
- Advertisement -

బాలానగర్: మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలంలో దారుణం జరిగింది. పదో తరగతి బాలికపై బాబాయ్ మరో ముగ్గురుతో కలిసి సామూహిక అత్యాచారం చేశారు. అనంతరం బాలికను చంపేశారు. బాలిక తల్లిదండ్రులు జీవనోపాధి నిమిత్తం హైదరాబాద్‌కు వెళ్లడంతో బాలిక ఇంట్లో ఒంటరిగా ఉంటుంది. బాబాయ్ శ్రీనివాస్ మరో ముగ్గురు స్నేహితులతో కలిసి బాలికపై అత్యాచారం చేసినట్టు గ్రామస్థులు తెలిపారు. బాలిక ప్రతిఘటించడంతోనే హత్య జరిగిందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. బాలికను చంపేశారా? లేక ఆమె ఆత్మహత్య చేసుకుందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News